Add Zee Business As A Preferred Source
App
Live Now

Ceasefire Broken By Pakistan: పాకిస్థాన్ భారీ దెబ్బ.. సరిహద్దుల్లో రెచ్చిపోయి కాల్పులు

India Pakistan Ceasefire Violation LIVE Updates: ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ డ్రోన్లతో భారత్‌పై దాడికి ప్రయత్నిస్తుండగా.. సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ceasefire Broken By Pakistan: పాకిస్థాన్ భారీ దెబ్బ.. సరిహద్దుల్లో రెచ్చిపోయి కాల్పులు
Image Credit: Donald Trump Tweet on Cease Fire
10 May 2025 11:54 PM (IST)

10 May 2025 11:49 PM (IST)
10 May 2025 11:47 PM (IST)

పాకిస్థాన్‌కు ఇస్లాం పలికే అర్హత లేదు
యుద్ధం వాతావరణం నేపథ్యంలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం. ఇస్లాం పేరుతో పాకిస్థాన అసత్య ప్రచారం చేస్తోంది. అమాయకులను.. చిన్నారులను హత్య చేయాలని ఇస్లాం చెప్పలేదు. పాకిస్థాన్‌ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఇస్లాం పేరుతో పాకిస్థాన్‌ మారణహోమం సృష్టిస్తోంది. అమ్మ కడుపులో నుంచి ఈ భూమిపై పడినప్పుడు ప్రాణం పోయే వరకు ఈ భూమి కోసమే బతకాలి' అని అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు.

10 May 2025 11:19 PM (IST)

డ్రోన్ల కలకలం
శ్రీనగర్‌ రాజ్‌బాగ్‌ ప్రాంతంలో డ్రోన్లు కలకలం. 25 కార్ప్స్‌ ప్రధాన కార్యాలయం వద్ద డ్రోన్లు కనిపించాయి. అన్ని డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.

10 May 2025 11:08 PM (IST)

సంపూర్ణ బాధ్యత పాక్‌దే
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని భారత విదేశాంగ శాఖ మంత్రి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. డీజీఎంఓల మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడానికి ఖండిస్తున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. 'కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాకిస్థాన్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఒప్పందాన్ని ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్‌దే' అని ప్రకటించారు.

10 May 2025 11:04 PM (IST)
10 May 2025 10:59 PM (IST)

India Pakistan Ceasefire Violation LIVE Updates: శ్రీనగర్‌లో ఎలాంటి కాల్పులు గానీ.. పేలుళ్లు లేవని సైనిక వర్గాలు వెల్లడించాయి. శ్రీనగర్‌లోకి కొన్ని డ్రోన్లు వచ్చాయని.. మళ్లీ వెనక్కి వెళ్లాయని తెలిపాయి. 

10 May 2025 10:35 PM (IST)
10 May 2025 10:29 PM (IST)

India Pakistan Ceasefire Violation LIVE Updates: కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.

==> ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

10 May 2025 10:17 PM (IST)

India Pakistan Ceasefire Violation LIVE Updates: కాల్పుల విరమణ కోసం వేడుకుని గంటలు గడవక ముందే పాక్ దొంగ బుద్ధి చూపడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యారు. కుక్క తోక ఎప్పటికీ వంకరగానే ఉంటుందని ట్వీట్ చేశారు. 

 

10 May 2025 10:01 PM (IST)

10 May 2025 09:47 PM (IST)
10 May 2025 09:45 PM (IST)

India Pakistan Ceasefire Violation LIVE Updates: అనేక చోట్ల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు

- నగ్రోటాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘన.

- గుజరాత్‌లోని భుజ్‌లో బ్లాక్‌అవుట్.

- జమ్మూలో 10 డ్రోన్‌లు కనిపించాయి.

10 May 2025 09:44 PM (IST)

India Pakistan Ceasefire Violation LIVE Updates: పెషావర్‌లో భారీ పేలుళ్లు.. 

==> మరోసారి లక్ష్యంగా మారిన PAF బేస్

==> పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) బేస్‌పై మళ్లీ దాడులు
    
==> పెషావర్‌ PAF బేస్‌లో భారీ పేలుళ్లు 

10 May 2025 09:40 PM (IST)

India Pakistan Ceasefire Violation LIVE Updates: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్  ఉల్లంఘన 

==> జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సరిహద్దుల్లో కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు సమాచారం

==> శ్రీనగర్ ప్రాంతాల్లో మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్

==> కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని సీఎం ఓమర్ అబ్దుల్  ట్వీట్

10 May 2025 09:34 PM (IST)

Pakistan Violates Ceasefire LIVE Updates: భారత్-పాక్ కాల్పుల విరమణ 3 గంటలు కూడా కొనసాగలేదు. పాకిస్థాన్‌ వైపు నుంచి డ్రోన్లు ఈ ప్రాంతాల వైపు దూసుకువస్తున్నాయి. 

==> ఉధంపూర్
==> అఖ్నూర్
==> నౌషేరా
==> పూంచ్
==> రాజౌరి
==> మెంధార్
==> జమ్మూ
==> సుందర్‌బాని
==> RS పుర
==> ఆర్నియా
==> కతువా

10 May 2025 09:19 PM (IST)
10 May 2025 09:17 PM (IST)

Pakistan Violates Ceasefire LIVE Updates: ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే పాక్ ఆర్మీ బార్డర్‌లో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శ్రీనగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అఖ్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్‌తో దాడులు చేస్తోంది. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని భారత ప్రభుత్వం BSFకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీనగర్లో బ్లాక్‌ అవుట్ విధించారు. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.

10 May 2025 08:22 PM (IST)
10 May 2025 07:11 PM (IST)

10 May 2025 07:08 PM (IST)
10 May 2025 06:22 PM (IST)
10 May 2025 06:20 PM (IST)

10 May 2025 06:09 PM (IST)

Donald Trump Tweet: తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించిన భారత్ పాక్ 

==> భారత డీజీఎంవో కి పాకిస్తాన్ డీజీఎంవో ఫోన్ 

==> సాయంత్రం 5 గంటల నుంచి సిజ్ ఫైర్ 

==> ధ్రువీకరించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి

10 May 2025 05:46 PM (IST)
10 May 2025 05:45 PM (IST)
10 May 2025 05:41 PM (IST)

Operation Sindoor LIVE Updates: భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

 

10 May 2025 05:35 PM (IST)

Operation Sindoor LIVE Updates: వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేరు వైరల్ అవుతున్న ఈ ట్వీట్ ఫేక్.

 

10 May 2025 05:30 PM (IST)
10 May 2025 05:12 PM (IST)

Operation Sindoor LIVE Updates: జూబ్లీహిల్స్‌లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద పోలీసుల భారీ భద్రత 

==> రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న పోలీసులు
==> టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు 
==> భారత్ సరిహద్దులో పాకిస్థాన్‌కి చెందిన 400 డ్రోన్లను పేల్చిన  భారత్
==> పాకిస్థాన్‌కు డ్రోన్లు అందజేసిన టర్కీ 
==> గగనతలంలోనే టర్కిష్ డ్రోన్లను ధ్వంసం చేసిన భారత్
==> దీంతో టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసుల బందోబస్తు 

 

10 May 2025 05:09 PM (IST)

10 May 2025 04:36 PM (IST)

Operation Sindoor LIVE Updates: బృహన్ ముంబై పరిధిలోని ఏ ప్రదేశంలోనూ ఎవరూ ఎటువంటి బాణసంచా పేల్చకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు నెలలు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది.  

10 May 2025 03:47 PM (IST)
10 May 2025 03:42 PM (IST)

Operation Sindoor LIVE Updates: పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు

==> మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది

==> వివాహ సెలవుల మీద ఉన్న జవాన్‌ మనోజ్ పాటిల్‌కు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది

==> మనోజ్ భార్య యామిని ‘నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా' అంటూ కన్నీటితో పంపించింది.

==> పెళ్ళైన మూడు రోజులకే తిరిగి బోర్డర్‌కు వెళ్లడంతో మనోజ్ పాటిల్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

10 May 2025 03:31 PM (IST)

Operation Sindoor India Pakistan War LIVE: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో.. సా.5 గంటలకు గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

==> కేంద్రానికి ఏపీ సంఘీభావంపై చర్చ
==> తిరుపతి, విశాఖ లాంటి సున్నిత ప్రాంతాల్లో..
==> రక్షణ చర్యలపై గవర్నర్‌కు వివరించనున్న చంద్రబాబు

10 May 2025 03:23 PM (IST)

10 May 2025 02:55 PM (IST)

మొబైల్‌ ఫోన్లకు యుద్ధ హెచ్చరికలు
భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధ వాతావరణంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇకపై ఈ హెచ్చరికలు నేరుగా మొబైల్‌ ఫోన్లకు రానున్నాయి. ప్రజలను హెచ్చరిస్తూ ఫోన్లకు ప్రభుత్వాలు అలర్ట్‌లు జారీ చేయనున్నాయి. ఈ హెచ్చరికలు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అందించనున్నాయి.

10 May 2025 02:35 PM (IST)

కార్మిక సంఘాల సమ్మెపై యుద్ధం ప్రభావం
భారతదేశం - పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కార్మిక సంఘాలు ఈనెల 20వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త సమ్మెపై ప్రభావం పడింది. యుద్ధం నేపథ్యంలో సమ్మె విరమించుకోవాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి రవీంద్ర హింతే విజ్ఞప్తి చేశారు. బీఎంఎస్ సమ్మెలో లేదు.. రక్షణశాఖ సంబంధిత విభాగాల పరిశ్రమలలో ఓటీ చేస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకింగ్, రవాణా రంగాలలో ఉద్యోగులు దేశం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

10 May 2025 02:29 PM (IST)

Operation Sindoor LIVE Updates: మే 7న భారత సైన్యం జరిపిన దాడిలో హతమైన ఉగ్రవాదుల వివరాలు ఇలా.. 

1.ముదస్సర్ ఖడియాన్ ఖాస్ @ ముదస్సర్ @ అబు జుండాల్

==> సంస్థ: లష్కర్-ఎ-తొయిబా

==> మురీడ్‌కేలోని మార్కజ్ తోయిబా ఇన్‌ఛార్జ్.

==> పాక్ ఆర్మీ అతని అంత్యక్రియలకు గౌరవ వందనం ఇచ్చింది.

==> పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి (మర్యం నవాజ్) తరఫున పుష్పగుచ్ఛాలు సమర్పించారు.

==> ప్రభుత్వ పాఠశాలలో అతని జనాజా నమాజ్ జరిగింది. దానికి జమాత్-ఉద్-దావా నేత హఫీజ్ అబ్దుల్ రవూఫ్‌ (గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తింపు పొందినవాడు) నేతృత్వం వహించాడు.

==> ఒక సర్వీసింగ్ లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీస్ ఐజి అతని ప్రార్థనా సభకు హాజరయ్యారు.

2.హఫీజ్ ముహమ్మద్ జమీల్

==> సంస్థ: జైష్-ఇ-ముహమ్మద్
==> మౌలానా మసూద్ అజ్హర్‌కు దగ్గర బంధువు (తమ్ముడి భార్యలలో ఒకరి అన్న).
==> బహావల్‌పూర్‌లోని మార్కజ్ సుభాన్ అల్లాహ్‌కు ఇన్‌ఛార్జ్.
==> యువతను తీవ్రవాద సిద్ధాంతాలతో భ్రష్టపరచడం.. జేఎం నిధుల సేకరణలో కీలక పాత్ర వహించేవాడు.

3.ముహమ్మద్ యూసుఫ్ అజ్హర్ @ ఉస్తాద్ జీ @ ముహమ్మద్ సలీం @ ఘోషి సాహబ్
==> సంస్థ: జైష్-ఇ-ముహమ్మద్
==> మసూద్ అజ్హర్‌కు బావ.
==> జేఎం కోసం ఆయుధ శిక్షణ అందించేవాడు.
==> జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు.
==> IC-814 విమానం హైజాక్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.

4. ఖాలిద్ @ అబు ఆకాషా

==> సంస్థ: లష్కర్-ఎ-తొయిబా
==> జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రదాడుల్లో పాలుపంచుకున్నాడు.
==> ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడు.
==> ఫైసలాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు.

5.ముహమ్మద్ హసన్ ఖాన్
==> సంస్థ: జైష్-ఇ-ముహమ్మద్
==> ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు (పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జెఎం ఆపరేషనల్ కమాండర్).
==> జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

10 May 2025 02:13 PM (IST)

10 May 2025 01:58 PM (IST)

Operation Sindoor LIVE Updates: కాకినాడ జిల్లాలో మూడు పోర్టులు పనిచేస్తున్నాయి. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలోని తొండంగి మండలంలో నూతనంగా నిర్మితమవుతున్న గేట్ వే పోర్ట్‌తో పాటు తీరప్రాంతాలలో ఉగ్రవాదుల చొరబాటు లేకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు బృందం పర్యవేక్షణ చేస్తోంది. డ్రోన్స్‌తో 24 గంటల నిఘా పెట్టారు. అదేవిధంగా మత్స్యకారులతో కలిసి పనిచేస్తూ అనుమానితుల సమాచారం తీసుకుంటున్నారు. కార్డన్ అండ సెర్చ్ నిర్వహించడం వంటి చర్యలతో అప్రమత్తంగా ఉన్నారు.

10 May 2025 01:46 PM (IST)

India Pakistan War LIVE: భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బహిరంగ ప్రదేశాలలో.. ముఖ్యంగా మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతం, చుట్టుపక్కల బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు.
 

10 May 2025 01:37 PM (IST)

Operation Sindoor LIVE Updates: పాకిస్థాన్ దృశ్చర్యలను ప్రతిఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవం ఆయన మాట్లాడుతూ.. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తుందని విమర్శించారు. భారతదేశం నుంచి విడిపోయిన తరువాత పాకిస్థాన్.. ఇక్కడి హిందువులకు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిందన్నారు. పెహాల్గామ్‌లో కుటుంబ సభ్యుల ముందు అతి కిరతకంగా హతమార్చారని.. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారని అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ సివిలియన్స్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని.. దానికి తగిన మూల్యం చెల్లిచుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని.. సైనికులకు అండగా ఉంటామన్నారు.

10 May 2025 01:27 PM (IST)

Operation Sindoor LIVE Updates: ఇండియన్ ఆర్మీకి సపోర్టుగా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ రెండవ బొగ్గు గని ఆవరణలో కార్మిక నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని గని ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందంటూ పాక్‌పై ఉక్కు పాదం మోపాలని నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలిచారు. జవాన్ మురళి నాయక్ మృతి పట్ల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందన్నారు. యుద్ధం పేరిట భారత్ లోని గ్రామాలు, అమాయకులపై దుశ్చర్యకు పాల్పడుతుందన్నారు. పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ బుద్ధి చెబుతుందని అన్నారు.
 

10 May 2025 01:21 PM (IST)

Operation Sindoor LIVE Updates: ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తూ.. బషీర్‌బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 

==> ఇన్నేళ్లుగా పాకిస్థాన్ తమపై దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చున్నాము

==> కానీ ఇప్పుడు దాడికి ప్రతి దాడితో సమాధానం ఇస్తున్నాము

==> పెహల్గామ్ దాడికి ప్రతిదాడిగా ఆపరేషన్ సింధూర్‌తో టెర్రరిస్టుల స్థావరాలను భారత సైన్యం నిర్వీర్యం చేసింది

==> ఈ పోరాటంలో భారత సైనికులకు ఆత్మస్థైర్యం ఇచ్చేలా అన్ని వర్గాల ప్రజలు దేవుళ్ళకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి

==> భారత సైన్యం ఈ పోరాటంలో విజయం సాధిస్తుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నాను.

10 May 2025 12:56 PM (IST)

Operation Sindoor LIVE Updates: శ్రీనగర్‌లో పాత ఎయిర్‌ఫీల్డ్ (టెక్నికల్ ఎయిర్‌పోర్ట్) వద్ద ఒక డ్రోన్‌ను కూల్చివేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.

==> ఈ ఘటన సమయంలో నగరాన్ని భారీ పేలుళ్లు వణికించాయి.

==> మధ్యాహ్నం సమయంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో రెండు భారీ పేలుళ్లు వినిపించాయని అధికారులు తెలిపారు.

10 May 2025 12:53 PM (IST)
10 May 2025 12:42 PM (IST)

Operation Sindoor LIVE Updates: జమ్ములోని చీనాబ్ రీజన్‌లోని స్థానిక ప్రజలకు భధ్రత బలగాల హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. బయటకు రావొద్దంటూ సైరన్ మోగించి మైకులో అనౌన్స్ చేస్తున్న ఆర్మీ.

10 May 2025 12:29 PM (IST)

10 May 2025 11:55 AM (IST)

Operation Sindoor LIVE Updates: పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది: కర్నల్ సోఫియా ఖురేషి 

- దాడులతో ఉద్రిక్తత పెంచుతోంది. వాటిని భారత సైన్యం గట్టిగా తిప్పికొడుతోంది. 

-శ్రీనగర్, ఉదంపూర్ , బటిండాలో దాడులకు పాల్పడుతోంది

- పలు చోట్ల పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై కూడా దాడులకు పాల్పడుతోంది. 

-భుజ్, బటిండాలోని ఎయిర్ స్టేషన్లపై పాకిస్తాన్ దాడి చేసింది. 

10 May 2025 11:43 AM (IST)

Operation Sindoor LIVE Updates: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు: సౌదీ అరేబియా

-భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాల పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం: సౌదీ అరేబియా 
 

10 May 2025 11:40 AM (IST)

Operation Sindoor LIVE Updates: జైశంకర్ కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ కాల్

- పరిస్థితులు సద్దుమణిగేలా చూడాలంటూ సూచించిన మార్కూ రూబియో 

-అవసరం అయితే ఇరుదేశాల మధ్య చర్యలకు సాయం చేస్తామంటూ ప్రతిపాదన 

10 May 2025 10:57 AM (IST)

Operation Sindoor LIVE Updates: LOC వద్ద హై అలెర్ట్ ప్రకటించిన భారత్

-భారత్, పాకిస్తాన్ సరిహద్దులో పెద్ద ఎత్తున కొనసాగుతున్న కాల్పులు. 

-LOC వద్ద హై అలెర్ట్ ప్రకటించిన భారత్.

- పాకిస్తాన్ ఆర్మీ కాల్పులును తిప్పికొడుతున్న భారత సైన్యం.

- రాజస్థాన్ జైసల్మేర్ లో పాకిస్తాన్ క్షిపణి శకలం స్వాధీనం. జైసల్మేర్ లో హై అలెర్ట్ ప్రకటించిన భారత్

-శ్రీనగర్ లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన భారత ఆర్మీ. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని స్థానిక ప్రజలకు ఆర్మీ హెచ్చరిక.

-ప్రధానీ నరేంద్ర మోదీ నివాసంలో కీలక భేటీ. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రధానీతో అజిత్  దోవల్ భేటీ. అర గంట నుంచి కొనసాగుతున్న సమావేశం.

- పంజాబ్ లోని జలంధర్ లో హై అలెర్ట్ ప్రకటించిన ఆర్మీ. డ్రోన్ లతో దాడికి పాకిస్తాన్ పాల్పడే అవకాశం ఉందని  హెచ్చరిక.

- రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో CDS అనిల్ చౌహాన్ భేటీ
 

10 May 2025 10:41 AM (IST)

Operation Sindoor LIVE Updates: పాకిస్తాన్ లాహోర్, ఇస్లామాబాద్ లో భారీ పేలుళ్లు

- పాకిస్తాన్ కు సంబంధించి రెండు ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

- పాకిస్తాన్ ఫతేహ్ మిసైల్ ను ధ్వంసం చేసిన భారత ఆర్మీ

- ప్రధానీ నివాసానికి చేరుకున్న భధ్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ 

-100 డ్రోన్లతో భారత్ పై దాడికి పాకిస్తాన్ విఫలయత్నం. డ్రోన్ల దాడిని అడ్డుకొని ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ

- భారత మిలటరీ వ్యవస్థ, ఎయర్ పోర్టులు, ఆలయాల లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు విఫలయత్నం

- గత 48 గంటల్లో దాదాపు వేయికి పైగా డ్రోన్లతో దాడి చేసిన పాకిస్తాన్. డ్రోన్లను అన్నింటిని నిర్వీర్యం చేసిన ఇండియా

- భారత్ పాకిస్తాన్ సరిహద్దుల తాజా పరిస్థితులపై ఆర్మీ ప్రెస్ మీట్

10 May 2025 10:37 AM (IST)

Operation Sindoor LIVE Updates: భారత్ పాక్ సరిహద్దుల తాజా పరిస్థితులపై ఆర్మీ ప్రెస్ మీట్

- పాకిస్తాన్ కు చెందిన 6 కీలక ఏయెర్ బేస్ లను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ. 

- భారత్ ధ్వంసం చేసిన వాటిలో నూర్ ఖాన్ ఏయిర్ బేస్, చఖాలా, సాయిల్ కోట్, మురిడ్, సరఘోదా  ఎయిర్ బేస్ ల ధ్వంసం

- రాజస్థాన్ బికనూర్ లో లభించిన పాకిస్తాన్ ధ్వంమైన  మిసైల్. 

- జమ్ముకశ్మీర్ : కఛ్ లో పాకిస్తాన్ కు చెందిన 6 డ్రోన్ లను ధ్వసం చేసిన ఇండియా

10 May 2025 10:20 AM (IST)

Operation Sindoor LIVE Updates: జమ్మూలో  BSF పోస్టులపై పాకిస్తాన్ కాల్పులు

- జమ్మూ సెక్టార్ లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై పాకిస్తాన్ రేంజర్స్ కాల్పులు 

- శుక్రవారం రాత్రి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న శత్రు దేశం 

-గట్టిసమాధానం ఇస్తున్న భారత బలగాలు 

10 May 2025 09:49 AM (IST)

Operation Sindoor LIVE Updates: భారత్ తో చర్చింది..మధ్యవర్తులుగా ఉంటాం: పాకిస్తాన్ కు అమెరికా సూచన 

-పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రూబియో ఫోన్ చేశారు

- పరిస్ధితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ కు సూచించారు రూబియో 

-అవసరం అయితే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వంగా ఉంటామని రూబియో తెలిపారు. 

10 May 2025 09:46 AM (IST)

Operation Sindoor LIVE Updates: భుజ్ వైమానిక దళ స్టేషన్ దగ్గర భద్రతను కట్టుదిట్టం 

-భుజ్ వైమానిక దళ స్థావరం సమీపంలో డ్రోన్లు కనిపించిన తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు. 

-ఎయిర్‌బేస్‌కు వెళ్లే రహదారిని ట్రాఫిక్ కోసం మూసివేశారు. ఉదయం స్థానికులు సైరన్ శబ్దం విన్నారు. 

-మహిళా ఆశ్రమం 36 క్వార్టర్ ప్రాంతం నుండి డ్రోన్ కనిపించినట్లు సమాచారం అందడంతో, పోలీసులు ప్రజలతో మాట్లాడి దర్యాప్తు ప్రారంభించారు.

10 May 2025 08:49 AM (IST)

Operation Sindoor LIVE Updates: హర్యానాలోని సిర్సాలో పాకిస్తాన్ క్షిపణి 'ఫతా 2' ధ్వంసం

-హర్యానాలోని సిర్సాలో పాక్ ఫతా 2 క్షిపణిని కూల్చేసిన భారత వైమానిక రక్షణ వ్యవస్థ

- ఈ క్షిపణి 400కి.మీ పరిధిని కలిగి ఉంది..కానీ భారత భద్రతా వ్యవస్థ ముందు విఫలం

- పాకిస్తాన్ అత్యంత ఆధునిక ఆయుధాల్లో ఫతా 2 ఒకటి

- ఆకాశంలోనే తుస్సుమనిపించిన భారత ఆర్మీ 

 

10 May 2025 08:46 AM (IST)

Operation Sindoor LIVE Updates: పాకిస్తాన్‌కు వంతపాడుతున్న టర్కీ, అజర్‌బైజాన్

- ప్రతిరోజూ కనీసం 300-400 టర్కీష్‌ డ్రోన్లు ప్రయోగిస్తున్న పాక్‌

- గుజరాత్‌, రాజస్తాన్‌, పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌లోని నగరాలే గురిగా పెట్టుకున్న పాక్‌

10 May 2025 08:28 AM (IST)

Operation Sindoor LIVE Updates: పాకిస్తాన్ మిలిటరీ పోస్ట్..టెర్రర్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం 

- సరిహద్దుల్లో పరిస్ధితులు ఉద్రిక్తం 

- నియంత్రణ రేఖకు ఆవల పాక్ పోస్టుల నుంచి డ్రోన్స్ ప్రయోగిస్తున్న శత్రు సైన్యం 

- ఆ పోస్టులను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ 

10 May 2025 08:08 AM (IST)

Operation Sindoor LIVE Updates:భారత్ పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో పాకిస్థాన్ జమ్మూ కశ్మీర్ లోని సిివిలియన్ ఏరియాల్లో చేస్తోన్న దాడులపై స్పందించిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా..

10 May 2025 08:05 AM (IST)

Operation Sindoor LIVE Updates: రాజస్థాన్ లో బార్మర్ ఏరియాలో జనవాసాలే టార్గెట్ గా పాకిస్థాన్ డ్రోన్లు, గుళ్లతో దాడి

10 May 2025 07:58 AM (IST)
10 May 2025 07:23 AM (IST)

జమ్మూ కశ్మీర్‌లోని ఉరిలోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో పలు ఇళ్లు, ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

10 May 2025 07:38 AM (IST)

దేశ రాజధాని ఢిల్లీలో దాడులకు పాకిస్థాన్ తెగపడే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది.

10 May 2025 07:23 AM (IST)

Operation Sindoor LIVE Updates: జమ్మూ కాశ్మీర్ లోని రియాసీలోని చీనాబ్ నది పై సలాల్ ఆనకట్ట 5 గేట్లు తెరిచిన భారత్..
తాజా విజువల్స్..

10 May 2025 07:12 AM (IST)

Operation Sindoor LIVE Updates: భారత్‌పై పాకిస్థాన్ మిస్సైల్ అటాక్ చేసింది. ఫతేహ్-1 మిస్సైళ్లతో జమ్మూ, పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లతో పాటు శ్రీనగర్, బియాస్, ఉధంపూర్ పట్టణాలపై దాడి చేసింది. వీటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. పలుచోట్ల భారీ శబ్దాలు వినిపించాయి. మరోవైపు భారత్ తమపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని పాక్ ఆరోపిస్తోంది.

10 May 2025 06:58 AM (IST)

పంజాబ్‌ జలంధర్‌లో పేలుడు తర్వాత పాకిస్తాన్ డ్రోన్ శకలాలు అక్కడ లభ్యమయ్యాయి

10 May 2025 06:35 AM (IST)

ఇస్లామాబాద్, లాహోర్ సహా పలు ప్రాంతాల్లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

మా సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసింది.

మా సైనిక స్థావరాలు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది..

 

10 May 2025 06:20 AM (IST)

ఇండియాపై  పాకిస్థాన్ అవాకులు చెవాకులు

భారత దేశం మూడు విమానాశ్రాయలపై దాడులు చేసింది.

రావల్పిండిలోని నూర్ ఖాన్ విమానాశ్రయంపై భారత్ దాడులకు దిగిందనేది ఆరోపణలు..

మరిద, రఫిక్ ఎయిర్ పోర్ట్ స్టావరాలపై మన దేశం వైమానిక దాడులు చేసింది.

పాక్ గగన తలాన్ని పూర్తిగా మూసి వేసిన పాకిస్థాన్

10 May 2025 05:54 AM (IST)

Operation Sindoor LIVE Updates: భారత్‌పై కీలకమైన సైనిక స్థావరాలు, నగరాలపై ప్రతీకార దాడులు ప్రారంభించిన పాక్.. కొద్దిసేపటికే NOTAM సలహా జారీ మేరకు శనివారం మధ్యాహ్నం వరకు అన్ని ట్రాఫిక్‌లకు తన గగనతలాన్ని మూసివేసింది.

10 May 2025 05:49 AM (IST)

Operation Sindoor LIVE Updates: రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంతోపాటు షోర్కోట్‌లోని రఫీకి వైమానిక స్థావరం, చక్వాల్‌లోని మురిద్ వైమానిక స్థావరాలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

10 May 2025 05:47 AM (IST)

Operation Sindoor LIVE Updates: పాకిస్థాన్ రావల్పిండిలోని నూర్ ఖాన్‌లోని పాక్ సైనిక వైమానిక స్థావరంపై క్షిపణి దాడి జరిగిందని ఉన్నత నిఘా వర్గాలు వెల్లడించాయి.

10 May 2025 05:38 AM (IST)
10 May 2025 05:30 AM (IST)

Operation Sindoor LIVE Updates: పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. పాక్‌లో ఆరు పేలుళ్లు సంభవించాయని సమాచారం. రావల్పిండిలో రెండు పేలుళ్లు వినిపించినట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి సద్దర్ ప్రాంతంలో, మరొకటి నూర్ ఖాన్‌లోని వైమానిక స్థావరాన్ని తాకింది. లాహోర్, షేక్‌పురా, ఇస్లామాబాద్ శివార్లలో పేలుళ్లు జరిగినట్లు సమాచారం.

10 May 2025 05:13 AM (IST)

Operation Sindoor LIVE Updates: ఓ వైపు భారత్.. మరోవైపు బలూచిస్థాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్‌కు ప్రకృతి కూడా సహకరించడం లేదు. రాత్రి 1.44 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు తెలిపింది.

10 May 2025 05:01 AM (IST)

Operation Sindoor LIVE Updates: బారాముల్లాలోని ఉరీ సెక్టార్‌లో కాల్పులకు తెగబడుతోంది పాకిస్థాన్ సైన్యం. ఈ కాల్పుల్లో ఓ భారత పౌరురాలిని మరణించగా.. మరికొందరు ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ జవాన్ కూడా ఉన్నారు. అటు రాజౌరి, అఖ్నూర్, జమ్మూ, కుప్వారా జిల్లాల్లో పాక్ కాల్పులు జరుపుతోంది. దీంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు, అధికారులు ఆయా జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

10 May 2025 04:49 AM (IST)

Operation Sindoor LIVE Updates: సరిహద్దుల్లోని 26 ప్రాంతాలపై పాకిస్థాన్ డ్రోన్లతో దాడులు చేసేందుకు యత్నించిందని భారత రక్షణ శాఖ తెలిపింది. వీటిలో ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నట్లు వెల్లడించింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బర్మర్, భుజ్ తదితర ప్రాంతాల్లో దాడి చేస్తుండగా.. ఆర్మీ వాటిని నిర్వీర్యం చేసిందని పేర్కొంది. ఫిరోజ్‌పూర్‌లో డ్రోన్ అటాక్‌లో ఓ కుటుంబం గాయపడిందని తెలిపింది.

10 May 2025 12:37 AM (IST)

Operation Sindoor LIVE Updates: ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేసిన తరువాత పంజాబ్, ఢిల్లీ ఐపీఎల్ జట్లతో కూడిన ప్రత్యేక రైలు ధర్మశాల నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరుకుందని బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది, ఇతర బీసీసీఐ అధికారులు సంతోషంగా ఉన్నారని.. వారి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారని చెప్పారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణోకి ధన్యవాదాలు తెలిపారు. 

10 May 2025 12:30 AM (IST)

10 May 2025 12:11 AM (IST)
10 May 2025 12:08 AM (IST)

Operation Sindoor LIVE Updates: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) దాదాపు 1 బిలియన్ డాలర్లు రుణం అందించేందుకు అంగీకరించిందని పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రుణం ఇవ్వొద్దని భారత్ కోరినా.. ఐఎంఎఫ్‌ పాక్‌కు లోన్‌ మంజూరు చేసింది.  

09 May 2025 11:58 PM (IST)

Operation Sindoor LIVE Updates: భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక ప్రకటన చేశారు.

==> దేశం మొత్తం భారత సైన్యంతో ఉంది
==> మనమందరం భారత సైన్యం స్ఫూర్తికి వందనం చేస్తున్నాము
==> ఈ కష్టకాలంలో మన సైనికులు సరిహద్దులను రక్షిస్తున్నారు
==> సైనికులకు మనం ఎప్పటికీ తీర్చుకోలేని రుణం ఉంది.
==> మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని రక్షించే విధిని నిర్వర్తిస్తున్నారు.

09 May 2025 11:56 PM (IST)

09 May 2025 11:24 PM (IST)

Operation Sindoor LIVE Updates: ఉధంపూర్‌లో సైరన్‌ శబ్దాలు వినిపించాయి. అమృత్‌సర్‌, పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌, హోషియార్‌పూర్‌, గురుదాస్‌పూర్‌, టార్న్‌ తరణ్‌లో పాకిస్థాన్‌ డ్రోన్ దాడులు చేస్తోంది. పాక్ డ్రోన్లను దీటుగా భారత బలగాలు ధ్వంసం చేస్తున్నాయి.

09 May 2025 11:22 PM (IST)

Operation Sindoor LIVE Updates: బారాముల్లా నుంచి భుజ్ వరకు సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయి. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్, లఖి నాలా ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. ఫిరోజ్‌పూర్‌లోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

పాక్ దాడి నేపథ్యంలో భారత సాయుధ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు ఇంటి లోపలే ఉండాలని.. బ్లాక్‌ అవుట్‌ను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. అప్రమత్తత, ముందు జాగ్రత్త చాలా అవసరమని చెబుతున్నారు.

09 May 2025 11:14 PM (IST)

Operation Sindoor LIVE Updates: వందే భారత్ ట్రైన్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు, సిబ్బందిని ఢిల్లీకి తీసుకువచ్చారు.

 

09 May 2025 11:11 PM (IST)

Operation Sindoor LIVE Updates: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్‌ పోర్టు, అవంతిపొర ఎయిర్‌ బేస్ సమీపంలో డ్రోన్ దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. పదుల సంఖ్యలో డ్రోన్లు పాకిస్థాన్ వైపు నుంచి ఎయిర్‌ పోర్టు టార్గెట్‌గా లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. భారత భద్రతా బలగాలు ఈ డ్రోన్ దాడులను దీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ దాడుల గురించి ఆందోళన వద్దని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

09 May 2025 10:53 PM (IST)
09 May 2025 10:52 PM (IST)

Operation Sindoor LIVE Updates: లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవి..

==> రాజౌరిలోని పాకిస్థాన్ డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా ధ్వంసం చేసింది.

==> ఫిరోజ్‌పూర్‌లోని ఖై ఫేమ్ గ్రామంలోని ఇంటిని డ్రోన్ పేల్చడంతో ప్రజలు గాయపడ్డారు.

==> జమ్మూలోని పాకిస్థాన్ డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థ  నాశనం చేస్తోంది.

==> శ్రీనగర్ విమానాశ్రయం చుట్టూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

==> అమృత్‌సర్‌లోని పాకిస్థాన్ డ్రోన్‌లను భారత వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది.

09 May 2025 10:46 PM (IST)

Operation Sindoor LIVE Updates: పాకిస్థాన్ డ్రోన్‌లతో వరుసగా దాడులకు దిగుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబాల్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. 

09 May 2025 10:37 PM (IST)
09 May 2025 10:21 PM (IST)

లైట్‌ బంద్‌ చేయని వ్యక్తి.. డ్రోన్‌ వేసిన పాకిస్థాన్‌
భారత్‌, పాకిస్థాన్‌ ఉద్రిక్తతల వేళ ప్రజలందరికీ కీలక ఆదేశాలు జారీ చేసినా కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండో రోజు శుక్రవారం ఒక చోట సైరన్‌ మోగించినా కూడా ఒక ఇంట్లో విద్యుత్‌ దీపాలు.. ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఆఫ్‌ చేయలేదు. లైట్లు ఆఫ్‌ చేయకపోవడంతో పాకిస్థాన్‌ ప్రయోగించిన డ్రోన్‌ ఆ ఇంటిపై పడింది. డ్రోన్‌ దాడి కారణంగా ఆ ఇల్లు ధ్వంసం కాగా.. మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో ఆ ఇంట్లోని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే భద్రతా దళాలు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఒక్క సంఘటన చెబుతుందో బ్లాక్‌ ఔట్‌ అనేది ఎంత ప్రాముఖ్యమో.. బ్లాక్‌ ఔట్‌ చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇది నిరూపిస్తోంది. అందుకే శత్రు దేశాల దాడి సమయంలో లైట్లు, ఇన్వర్టర్లు.. ఇతర వెలుతురు నిచ్చే అన్నింటిని బంద్‌ చేయాలి. లేకపోతే భారీ నష్టం ఎదుర్కొనే అవకాశం ఉందని సైనం హెచ్చరిస్తోంది.

09 May 2025 10:15 PM (IST)

పాకిస్థాన్‌ డ్రోన్లన్నీ కూల్చివేత
జమ్మూ, పంజాబ్‌, రాజస్థాన్‌లో పాకిస్థాన్‌ డ్రోన్‌ల వర్షం కురిపిస్తుండగా వాటిని భారత సాయుధ దళాలు విజయవంతంగా కూల్చివేస్తున్నాయి. దాదాపుగా అన్ని డ్రోన్‌లను కూల్చివేస్తున్నాయి. జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ ప్రయోగిస్తున్న డ్రోన్‌లను గగనతలంలోనే భారత దళాలు ధ్వంసం చేస్తున్నాయి.

09 May 2025 10:02 PM (IST)

పాకిస్థాన్‌ దరిద్రపు ఆలోచన
భారతదేశంతో తలపడడంలో విఫలమవుతున్న పాకిస్థాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా రెండు రోజులు భారత్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌పై పైచేయి సాధించలేని పాకిస్థాన్‌ తాజాగా లక్ష్యం మార్చుకున్నట్లు శుక్రవారం జరిగిన దాడులను పరిశీలిస్తే అర్థమవుతోంది. జమ్మూ, పంజాబ్‌, రాజస్థాన్‌లో జరుగుతున్న దాడులు జనావాసాల్లో జరుగుతున్నాయి. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా తీవ్ర ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

ఆస్తి, ప్రాణనష్టం కోసమే..
సైనిక స్థావరాలను విధ్వంసం చేయడంలో విఫలమైన పాకిస్థాన్‌ అది సాధ్యం కాలేకపోవడంతో రెండో రోజు జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ దాడులు చేసింది. ఇళ్లపై దాడులు చేయడంతో ఆస్తి, ప్రాణనష్టం కలిగించాలనే దుర్భుద్ధి చూపిస్తోందని తెలుస్తోంది. రాత్రి జరుగుతున్న దాడులతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు గాయాలతోపాటు ఆస్తి నష్టం సంభవించింది. కాగా భారత్‌ మాత్రం పాకిస్థాన్‌ సైనిక స్థావరాలనే లక్ష్యంగా దాడులు చేస్తూ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా దాడులు చేస్తోంది. కానీ పాకిస్థాన్‌ మాత్రం కుట్రపూరితంగా అమాయక ప్రజలపై దాడులు చేయడం క్షమించరానిదిగా చెప్పవచ్చు.

09 May 2025 09:57 PM (IST)

హర్యానా, పంజాబ్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత
పాకిస్థాన్‌ దాడుల నేపథ్యంలో హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత. పంచకుల అంబాలాతోపాటు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు.

09 May 2025 09:53 PM (IST)

కృతజ్ఞత లేని టర్కీ

గతంలో టర్కీ ఇబ్బందుల్లో ఉంటే భారతదేశం భారీ ఎత్తున సహాయం చేసింది. 
==> 150+ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 
==> 99 మంది సభ్యుల వైద్య బృందం
==> 30 పడకల ఆసుపత్రుల ఏర్పాటు
==> 4000+ రోగులకు 24x7 చికిత్స అందించారు
==> 140+ టన్నుల సహాయ సామాగ్రి

==> 7 విమానాలకు పైగా సహాయ సామగ్రిని పంపారు.

ఇంతటి సహాయం చేసిన భారతదేశాన్ని కాదని పాకిస్థాన్‌కు సహాయం చేస్తున్న టర్కీ. అంతర్జాతీయ స్థాయిలో టర్కీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

09 May 2025 09:39 PM (IST)

09 May 2025 09:36 PM (IST)

India Pakistan War LIVE Updates: ఎల్‌వోసీ వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘనలు..

రాజౌరి, మెంధార్, పూంచ్, ఉరి, కుప్వారా, తంగ్‌ధార్, లీపా ప్రాంతాల్లో పాకిస్థాన్ కాల్పులకు దిగింది. భారత సైన్యం దీటుగా బదులు ఇస్తోంది.

Add Zee News as a Preferred Source

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More