Ahmedabad Plane Crash LIVE Updates: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందితోపాటు విమానం కూప్పకూలిన భవనంలోని 20 మంది మెడికోలు కూడా మృత్యువాతపడ్డారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే మేఘాని నగరంలో కుప్పకూలింది. సమీపంలో బీజే మెడికల్ కాలేజీపై విమానం కూలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, ఫైర్ ఇంజిన్లు అక్కడి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









