)
Vijay Karur Rally Stampede Live Updates: కరూర్ తొక్కిసలాటలో 33 మంది చనిపోవడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
நெஞ்சு பதைக்கிறது. கரூரிலிருந்து வரும் செய்திகள் பேரதிர்ச்சியையும் வேதனையையும் அளிக்கின்றன. கூட்ட நெரிசலில் சிக்கி உயிரிழந்த அப்பாவி மக்களுக்கு என் ஆழ்ந்த இரங்கலைத் தெரிவிக்கவும் வார்த்தைகளின்றித் திகைக்கிறேன்.
நெரிசலிலிருந்து மீட்கப்பட்டவர்களுக்கு உரிய சிகிச்சையும்,…
— Kamal Haasan (@ikamalhaasan) September 27, 2025
Vijay Karur Rally Stampede Live Updates: కరూర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 33 మంది చనిపోయినట్లు మంత్రి ఎం. సుబ్రమణియన్ ప్రకటించారు. మరణించిన వారిలో ఏడుగురు చిన్నారులు, 17 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారని ఆయన తెలిపారు. వీరంతా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయారని వెల్లడించారు.
Vijay Karur Rally Stampede Live Updates: కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష పరిహారం అందించనున్నట్లు తెలిపారు.
Vijay Karur Rally Stampede Live Updates: తమిళనాడు బ్రేకింగ్
TVK పార్టీ మీటింగ్ లో తొక్కిసలాట..
40 మందికి పైగా మృతి, మృతుల్లో ఆరు మంది చిన్నారులు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం...
తమిళనాడు కరూర్ లో ఘటన, కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆష్మిక అనే పాప తప్పిపోయిన సందర్భంలో వెతికే ప్రయత్నంలో తొక్కిసలాట
విజయ్ మీటింగ్ కి హాజరైన 40 వేల మంది కార్యకర్తలు
యుద్ధప్రాతిపదకన కొనసాగుతోన్న సహాయల చర్యలు, ఘటన స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించిన సీఎం స్టాలిన్.
Vijay Karur Rally Stampede Live Updates: విజయ్ ర్యాలీ జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను పరామర్శించేందుకు సీఎం స్టాలిన్ ఆదివారం కరూర్‌ను సందర్శించే అవకాశం ఉంది.
Vijay Karur Rally Stampede Live Updates: సభకు పది వేల మంది వస్తారని నిర్వాహకులు అనుమతి తీసుకోగా.. 50 వేల మందికిపైగా రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
கரூரிலிருந்து வரும் செய்திகள் கவலையளிக்கின்றன.
கூட்ட நெரிசலில் சிக்கி மயக்கமுற்று மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டுள்ள பொதுமக்களுக்குத் தேவையான உடனடி சிகிச்சைகளை அளித்திடும்படி,
முன்னாள் அமைச்சர் @V_Senthilbalaji, மாண்புமிகு அமைச்சர் @Subramanian_Ma அவர்களையும் - மாவட்ட…— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 27, 2025
Vijay Karur Rally Stampede Live Updates: కరూర్‌లో శనివారం జరిగిన రాజకీయ ప్రచార ర్యాలీలో అకస్మాత్తుగా జనసమూహం పెరగడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Vijay Karur Rally Stampede Live Updates: టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో స్పృహ కోల్పోయిన అనేక మంది చనిపోయి ఉంటారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. తమిళనాడులోని కరూర్ ఆసుపత్రులలో దృశ్యాలు భయాందోళనగా ఉన్నాయి.
Tamil Nadu Stampede Live Updates: తమిళనాడు కరూర్‌లో సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన మీటింగ్‌లో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 33 మంది మృతి చెందారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ఆస్కారం ఉంది. గాయపడిన వారిని కరూర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూర్ స్పందించారు. జిల్లా కలెక్టర్‌ను సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆరోగ్య మంత్రి, పాఠశాల విద్యా మంత్రిని కరూర్‌కు త్వరగా వెళ్లాలని చెప్పారు. విజయ్ సభలో తొక్కిసలాటకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.