LK Advani On NTR: భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు రాజకీయ భీష్ముడు భారతరత్నలాల్ కృష్ణ అద్వానీ తన ఆత్మకథ ‘మై కంట్రీ మై లైఫ్’ పుస్తకంలో అన్నగారైన ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చలనచిత్ర రంగానికి సంబంధించిన స్టార్ హీరో ఎన్టీఆర్.. 1982లో తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించడం ఓ సంచనం. అంతేకాదు ఆ పార్టీతో దక్షిణాదిలోని రాష్ట్రంలో కాంగ్రెస్ కోటను ఒంటరిగా పడగొట్టారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పేందుకు ఆయన చేసిన ప్రయత్నం, పోరాటం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
ఢిల్లీలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తమ హై కమాండ్ ముందు బానిసలుగా మారడాన్ని వ్యతిరేకించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన గొప్ప నేత, దేశభక్తుడు ఎన్టీఆర్ అని ఎల్.కే అద్వానీ తన ఆత్మకథలో రాసుకొచ్చారు. అతను చట్టబద్ధమైన ప్రాంతీయ ఆకాంక్షలను, బలమైన జాతీయవాద కట్టుబాట్లతో సమన్వయం చేయడానికి కృషి చేశారన్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఎన్టీఆర్‌లో తనను ప్రత్యేకంగా ఆకర్శించింది ఏమిటంటే కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్య, స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో ఆయనకున్న నిజమైన సంకల్పం అకుంఠిత దీక్ష అని అద్వానీ రాసుకొచ్చారు..తన లక్ష్యాన్ని సాధించడానికి, ఎన్టీఆర్ ప్రతిపక్ష పార్టీలను ఒక వేదికపై సమీకరించటానికి నిర్విరామంగా కృషి చేశారు. 1983 ప్రారంభంలో నిర్వహించిన అనేక ప్రతిపక్ష సమావేశాలకు వెన్నుదన్నుగా నిలిచి నమ్మకంతో నిలబడిన నిజమైన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ బీజేపీ పట్ల పక్షపాతం గానీ వంచనను ప్రదర్శించలేదని అద్వానీ తన ఆత్మకథలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









