Best Data Plans: ప్రస్తుతం ఇంటర్నెట్ డేటా అనేది ఓ అత్యవసరంగా మారిపోయింది. అందుకే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు అత్యంత తక్కువ ధరకే వివిధ రకాల డేటా ప్లాన్స్ అందిస్తున్నాయి. పోటీని తట్టుకుంటూ యూజర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ప్రయోజనాలతో డేటా ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. చాలా తక్కువ ధరకే డేటా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ వివరాలు మీ కోసం.
దేశంలో అత్యంత చౌక ధరకు రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న సంస్థ బీఎస్ఎన్ఎల్. 5జీ అందుబాటులో లేకపోయినా 4జి సేవలు చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఇందులో డేటా ప్లాన్స్ 16 రూపాయలతో ప్రారంభమౌతుంది. ఒక రోజు వ్యాలిడిటీతో 2జీబీ డేటా లభిస్తుంది. 98 రూపాయల ప్లాన్ తీసుకుంటే 22 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.
ఇక రిలయన్స్ జియో నుంచి డేటా ప్లాన్ 15 రూపాయల నుంచి ప్రారంభమౌతుంది. ఈ ప్లాన్ కేవలం ఒకరోజు వ్యాలిడిటీతో 1జీబీ డేటాతో వస్తుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు అత్యవసరమైతే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఇక 91 రూపాయల ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం 6జీబీ డేటా లభిస్తుంది. ఇంట్లో వైఫై ఉండేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక ఎయిర్‌టెల్ డేటా ప్లాన్ 19 రూపాయల నుంచి ప్రారంభమౌతుంది. ఇది కూడా ఒక రోజు వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుంది. 100 రూపాయల ప్లాన్ తీసుకుంటే 28 రోజులపాటు 5జీబీ డేటా లభిస్తుంది.
ఈ ప్లాన్స్ అన్నీ డేటా పెద్దగా అవసరం లేనివారికి లేదా ఇంట్లో వైఫై సౌకర్యం ఉండి ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు అత్యవసరమైన సందర్భాల్లో ఉపయోగుపడతాయి. మీ నెట్‌వర్క్‌ను బట్టి బీఎస్ఎన్ఎల్, వీఐ, జియో, ఎయిర్‌టెల్ సంస్థలు అన్నీ 15 నుంచి 19 రూపాయల మధ్యలో ఒక రోజు వ్యాలిడిటీతో అప్పటికప్పుడు అవసరమైన డేటాను అందిస్తాయి.
Also read: Heavy Rainfall Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ రేపు కుమ్మేయనున్న వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









