)
Love Swaps incident in Bareilly Uttar Pradesh: ప్రస్తుతం సమాజంలో అనేక దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు సమాజంలో భార్యభర్తల బంధంను ఎంతో గొప్పదిగా చెబుతుంటారు. కానీ ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తుంటే జనాలు ఎటుపోతున్నారని ఆందోళనలు కల్గుతున్నాయి.ఈ క్రమంలో కొన్ని చోట్ల భార్యలుతమ భర్తల్ని, మరికొన్ని చోట్ల భర్తలు తమ భార్యల్ని లేపేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు రోజు వార్తలలో ఉంటున్నాయి.యూపీలోని బరేలీలో మాత్రం వెరైటీ ఘటన చోటు చేసుకుంది. అచ్చం సినిమా స్టోరీలాగా ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కములుపూర్ గ్రామానికి చెందిన కేశవ కుమార్ కు ఆరేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. ఇతగాడు.. ఇటీవల తన భార్య సోదరి కల్పనతో ఇంటి నుంచి పారిపోయాడు.
అయితే.. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే.. భార్య సోదరుడైన రవీందర్.. బావ అయిన కేశవ్ కుమారీ సోదరితో పరారయ్యాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్తులంతా షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులను నమోదు చేశారు. దీనితో గాలింపు చర్యలు చేపట్టి నలుగుర్ని పట్టుకుని పీఎస్ కు తరలించారు.
ఆ తర్వాత వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి వీరిని వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా పెద్ద దుమారంగా మారింది. మరోవైపు వీరి కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకరించాయి. దీంతో పోలీసులు ఈ కేసును క్లోజ్ చేసిన కూడా ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇదెక్కడి వింతరా నాయన అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook