)
Lower Berth TTE Viral Video: రైలులో లోయర్ బెర్త్ కావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల సులభంగా మీకు కూడా రైల్వే లోయర్ బెర్త్ లభిస్తుంది. వృద్ధులు, మహిళలకు లోయర్ బెర్త్ ప్రాధాన్యత ఇస్తారు. అయితే రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ పాటిస్తే సులభంగా లోయర్ బెర్త్ పొందవచ్చని ఇటీవల ఒక టీటీఈ వివరించారు. ఈ టీటీఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో కొంతమంది వృద్ధ మహిళలు లోయర్ బెర్త్ పొందలేక పోతారు. వారు చేసిన తప్పేంటో అతను చెబుతాడు. మీరు కూడా లోయర్ బెర్త్ కావాలంటే రైల్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి. రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే 60 రోజులు ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా రైల్వే స్టేషన్ వెళ్లి నేరుగా టికెట్ కూడా బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.
రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సీనియర్ సిటిజెన్లకు లోయర్ బెర్త్ దొరక్క వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఓ టీటీఈ వివరించిన తీరు నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ప్రధానంగా లోయర్ బెర్త్ అంటే 45 ఏళ్లు పైబడిన మహిళలు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు కేటాయిస్తారు. రైల్వే టికెట్ బుక్ చేసుకునేటప్పుడే సీనియర్ సిటిజన్ కోటా ఎంచుకోవాలి. అప్పుడే లోయర్ కోట కేటాయిస్తారు. ఇది గర్భిణీలకు కూడా వర్తిస్తుంది.
Important and useful train ticket booking hack... if you are senior citizen
Kudos to this TTE for calmly explaining this, He deserves a raise @RailwaySeva @AshwiniVaishnaw pic.twitter.com/l5VJwATRKR
— Woke Eminent (@WokePandemic) November 10, 2025
సాధారణంగా రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక పీఎన్ఆర్ పై ఇద్దరు సీనియర్ సిటిజన్లకు కూడా ఈ కోట వర్తిస్తుంది. అయితే నాన్ సీనియర్ ప్రయాణికులు ఉంటే మాత్రం జనరల్ కోటా వర్తిస్తుంది. అందుకే లోయర్ బెర్త్ దొరకడం లేదు. ఒకవేళ రైలు ప్రయాణం చేసేటప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ సీనియర్ సిటిజనలు ఉన్నప్పుడు లోయర్ బెర్త్ దొరకడం కష్టతరమవుతుంది. అయితే వేర్వేరు పీఎన్ఆర్ ల పై టికెట్ బుక్ చేస్తే మాత్రం లోయర్ బెర్త్ దొరికే అవకాశం ఉందని టీటీఈ చెప్తాడు.
మన ఇండియన్ రైల్వేస్ లో స్లీపర్ క్లాసులో ప్రతి కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు ఈ కోట కింద కేటాయిస్తారు. త్రీ టైర్లలో ఐదు. టూ టైర్ల మూడు కేటాయిస్తారు. బుకింగ్ సమయంలో వయసు ధ్రువీకరణ అవసరం లేదు కానీ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే, వేర్వేరు పీఎన్ఆర్‌ల పై టికెట్ బుక్ చేస్తే మాత్రం అందరికీ ఒకే భోగిలో బెర్త్ వస్తుందని నమ్మకం కూడా లేదు. అందుకే ఈసారి రైల్వే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు రెండు పీఎన్‌ఆర్‌లపై టికెట్ బుక్ చేసుకుంటారా? ఒకే భోగీలో ప్రయాణం చేయాల్సి చేస్తారా? అనేది రైల్వే ప్రయాణికులు నిర్ణయించుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.