Vijay shah controversial comments on colonel sophia Qureshi video: జమ్ములోని పహల్గంలో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఏప్రిల్ 22న మారణకాండ చేశారు. అమాయకులైన 26 మంది టూరిస్టుల్ని పొట్టన పెట్టుకున్నారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని.. మన ఆడబిడ్డలు, మహిళల కుంకుమను తీసేశారు. ఈ క్రమంలో భారత్ దాయాదులపై ఆపరేషన్ సిందూర్ తో ప్రతీకారం తీర్చుకుంది. వంద మంది వరకు ఉగ్రవాదుల్ని హతం చేసింది.
మనం దాయాదిపై చేస్తున్న దాడుల్ని ఎప్పటి కప్పుడు.. భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా ముందు వివరాలు వెల్లడించారు. మన ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారికి.. మన ఆడబిడ్డలతోనే ఆపరేషన్ సిందూర్ పేరుతో.. ధీటుగా సమాధానం ఇచ్చింది.
नीच, कायर, देशद्रोही‼️
ये बेशर्म आदमी मध्यप्रदेश की BJP सरकार का मंत्री विजय शाह है।
हमारी सेना की बहादुर जांबाज देशभक्त कर्नल को आतंकवादियों की बहन बता रहा है।
हिन्दुस्तान की जिन बेटियों पर हमें नाज़ उनके लिए ये जाहिल भाजपाई मंत्री के ऐसे बोल कतई बर्दाश्त नहीं किया जाएगा। pic.twitter.com/WFHEEBVmk7
— AamAadmiPartyUPMedia (@MediaCellAAPUP) May 13, 2025
ఈ క్రమంలో ఒక్కసారిగా దేశంలో సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ల పేరు మార్మోగిపోయింది. ఈ క్రమంలో ఎంపీకి చెందిన బీజేపీ కెబినెట్ మంత్రి విజయ్ షా చేసిస వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారంగా మారింది. దీనిపై కాంగ్రెస్ కూడా సీరియస్ అయ్యింది.
విజయ్ షా ఒక సమావేశంలో మాట్లాడుతు..టెర్రరిస్టులు.. మన సోదరీమణులు, ఆడకూతుళ్ల సిందూరం తుడిచేసి పారిపోయారు. ఈ క్రమంలో మనం ఆపరేషన్ సిందూర్ తో వాళ్లకు గట్టిగా బుద్ది చెప్పాం. వాళ్ల మతానికి చెందిన సోదరి కల్నల్ ఖురేషితో వాళ్లకు బుద్ది చెప్పించామన్నారు.
ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. సోఫియా మతం గురించి మాట్లాడటం, ఆమె టెర్రరిస్టులకు సోదరి అని సంభోధించడం ఇప్పుడు రచ్చగా మారింది. వెంటనే ఆయనను తన పదవికి రాజకీమా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి