Madras High court Justice: డీఎంకే ఎంపీల బరి తెగింపు.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం..

Madras High court Justice impeachment motion:మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీ.ఆర్‌ స్వామినాథన్‌పై ఇంపీచ్‌మెంట్‌ తీర్మానానికి డీఎంకే ఎంపీలు ప్రయత్నించడం దుమారం రేపుతోంది. జస్టిస్‌ జి.ఆర్‌ స్వామినాథన్‌ను తొలగించాలంటూ వందమందికిపైగా ఎంపీలు సంతకాలు చేసి, లోక్‌సభ స్పీకర్‌కు మోషన్‌ ఇవ్వడం వివాదాస్పదం అవుతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 10, 2025, 03:10 PM IST
Madras High court Justice: డీఎంకే ఎంపీల బరి తెగింపు.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం..

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలన్న నిర్ణయానికి తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదమే కారణం. డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటలలోపు తిరుప్పరంకుండ్రంలోని “దీపతూన్” అనే శిలపై కార్తీక దీపాన్ని వెలిగించాలని జస్టిస్ స్వామినాథన్ ఆదేశించారు. ఈ దీపతూన్, సికందర్ బాదుషా దర్గా సమీపంలో ఉండడం వల్ల ఇది సున్నిత ప్రాంతంగా పరిగణించబడుతోంది. సాధారణంగా కార్తీక దీపాన్ని కొండపై ఉన్న ఉచిపిళ్లయ్యార్ ఆలయం దగ్గర దీప మండపంలో వెలిగిస్తారు. కానీ ఈసారి నలుగురు పిటిషనర్లు దీపతూన్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి కోరగా, న్యాయమూర్తి అభ్యంతరాలు తిరస్కరించారు. దీపం వెలిగించడం  వల్ల దర్గాకు చెందిన ముస్లింల హక్కులకు ఎటువంటి భంగం కలగదని చెప్పారు.  కానీ అలా చేయకపోతే ఆలయానికి సంబంధించిన భూ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వుల వల్ల శాంతిభద్రతలకు భంగం కలగవచ్చని భావించిన తమిళనాడు ప్రభుత్వం దీనిని అమలు చేసేందుకు నిరాకరించింది.

Add Zee News as a Preferred Source

దీనికి కారణం ఈ ఉత్తర్వు 2017లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు పూర్తి విరుద్ధమని డీఎంకే తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలలే ఉన్న సమయంలో ఇది మత ఉద్రిక్తతలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై లోక్‌సభలో కూడా చర్చ జరిగింది. డీఎంకే నేత టి.ఆర్.బాలు, తమిళనాట మత చిచ్చు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డిసెంబర్ 4న హిందూ మక్కల్ కచ్చి, హిందూ తమిళర్ కచ్చి, హనుమాన్ సేన, హిందూ మున్నాని వంటి హిందూ సంఘాల కార్యకర్తలు దీపం వెలిగించేందుకు కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

దీపం వెలిగించకపోవడంతో ఆలయం ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు ఉత్తర్వుపై తుది తీర్పు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం చేతుల్లో ఉంది.

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. హిందూ విశ్వాసాలను, ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు అని నొక్కి వక్కాణించారు దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తిపై అభిశంసనకు 120 మంది ఇండి కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని  ఆయన తప్పుబట్టారు. ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలపై తీర్పులు ఇచ్చే జడ్జీలను బెదిరించడమే అని చెప్పారు. ఇలాంటి చర్యల వలన జడ్జీలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. హిందూ సంప్రదాయ విషయాలపై తీర్పుల ఇచ్చే జడ్జీలు  జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం కాదా? ఇది సూడో సెక్యులరిజం కాదా?’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో మంగళవారం పోస్టు చేశారు. 

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News