Jaykumar Gore: షాకింగ్.. మహిళలకు న్యూడ్ ఫోటోలు పంపి లైంగికంగా వేధించిన మంత్రి.. ఎక్కడంటే..?

Jaykumar gore nude controversy: మహారాష్ట్రకు చెందిన మంత్రి జయకుమార్ గోరే ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొంత మంది మహిళలకు న్యూడ్ ఫోటోలు పంపారని అపోసిషన్ పార్టీలు ఆయనపై ఆరోపణలు చేశాయి. ఈ ఘటన ప్రస్తుతం దుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 5, 2025, 06:11 PM IST
  • మహిళ పట్ల నీచంగా ప్రవర్తించిన మంత్రి..
  • చర్యలు తీసుకొవాలని అపోసిషన్ పార్టీల డిమాండ్..
Jaykumar Gore: షాకింగ్.. మహిళలకు న్యూడ్ ఫోటోలు పంపి లైంగికంగా వేధించిన మంత్రి.. ఎక్కడంటే..?

Jaykumar gore harassed womens in maharashtra: ప్రభుత్వాలు మహిళల భద్రతకు ఎన్నిజాగ్రత్తలు తీసుకున్న కూడా ప్రతిరోజు అమ్మాయిలు,మహిళలపై వేధింపులు, అత్యాచారాల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. బస్టాండ్, రైల్వేస్టేషన్,  మెట్రోలు ఇలా ప్రతిచోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. మహిళలను కాపాడాల్సిన పోలీసులు సైతం కొంత మంది వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఒక మంత్రి మహిళలకు న్యూడ్ ఫోటోలు పంపిన ఘటన ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. దీనిపై శివసేన, కాంగ్రెస్ లు బీజేపీ పై మండిపడుతున్నాయి.

Add Zee News as a Preferred Source

మహారాష్ట్ర కు చెందిన  మంత్రి జయకుమార్ గోరే మహిళకు న్యూడ్ ఫోటోలు పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే.. దీనిపై గతంలో పెద్ద దుమారం చెలరేగింది. ఈ క్రమంలో మహిళ అమాయకత్వంను ఆసరాగా చేసుకుని  మంత్రి ఆమెను బెదిరింపులకు పాల్పడుతున్నాడని శివసేన, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మహారాష్ట్రలో ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే రాజీనామా చేసిన మరుసటి రోజే , జయకుమార్ గోరే ఘటన మరోసారి వెలుగులోకి రావడం రాజకీయంగా పెను సంచలనంగా మారింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకొకుంటే.. బాధితురాలితో కలిసి పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని శివసేన, కాంగ్రెస్ లు ప్రభుత్వంకు అల్టిమేటం జారీ చేశాయి. దీనిపై ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. స్వర్గేట్ కేసు వెలుగులోకి వచ్చిందన్నారు.

Read more: MLA Abu Azmi: ఔరంగజేబ్‌ గొప్పవాడంటూ ఎమ్మెల్యే ప్రశంసలు.. మహారాష్ట్రలో రాజుకున్న వివాదం..

దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రి జయకుమార్ గోర్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మంత్రి ఒక మహిళను ఎలా హింసించి, వేధించాడనే సమాచారం బయటపడింది. ఆ నిస్సహాయ మహిళ రాబోయే కొద్ది రోజుల్లో విధాన్ భవన్ ముందు నిరాహార దీక్ష చేయనుందని తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం మహ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News