Maharashtra Chief Minister: మహారాష్ట్రలో గత 50 యేళ్లలో ఓ కూటమిగా ఓ ప్రభుత్వం ఈ రేంజ్ సీట్లు సాధించలేదు. ఈ కూటమి ఏర్పాటులో ముందు నుంచి బీజేపీ పెద్దన్న పాత్ర వహించింది. అంతేకాదు గతంలో ఉద్ధవ్ థాక్రే నుంచి షిండే గ్రూపును వేరు చేయడంలో తెర వెనక పాత్ర పోషించింది. అంతేకాదు శివసేన నేత ఉద్ధవ్ థాక్రే.. హిందూ ఓటర్లను ఏ రకంగా మోసం చేసారనేది ప్రజల్లో బలంగా తీసుకెళ్లగలిగారు. అంతేకాదు ఓ కూటమిగా గెలిచిన తర్వాత సీఎం పీఠం కోసం తమ సిద్ధాంతాలకు విరుద్ధమైన కూటమివైపు ఉద్ధవ్ వెళ్లడాన్ని ప్రజలు కూడా హర్షించలేదనే విషయం తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు స్పష్టం చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు నిజమైన శివసేన షిండే వర్గానిదే అని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన షిండే .. ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినా.. తమకే ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలని మంకు పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు..ముందు  రెండున్నర సంవత్సరాలు సీఎంగా ఫడ్నవీస్... ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు షిండే సీఎంగా కొనసాగేలా ఓ ఆమోద యోగ్య ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే టైంలో అజిత్  పవార్ డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ నే సీఎంగా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ నేతలు ఇద్దరు తెలిపారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ లను డిప్యూటీ సీఎంలుగా చేయాలని ప్రతిపాదించినట్టు వివరించారు. ఈ ప్రతిపాదనలకు శివసేన, ఎన్సీపీలు అంగీకారం కూడా తెలిపాయని వివరించారు. ఇందుకు సంబంధించి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె పెళ్లికి హాజరు కావడానికి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు.


ఈ పర్యటనలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సీఎం సీటు విషయమై మాట్లాడినట్టు తెలిసింది. ఈ నెల 28 లేదా 29వ తేదీల్లో ప్రమాణ స్వీకారం ఉండొచ్చని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా  ఎవరు ఉండాలనే విషయం తేల్చడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ముంబయికి రానున్నారు. కాగా, తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని, సీఎం ఎవరనేదానిపైనా ఆమోదం తెలుపలేదని శివసేన ఈ ప్రచారాన్ని ఖండిచింది. సీఎం సీటు కోసం పట్టుబడుతున్న ఏక్‌నాథ్ షిండే ఈ ప్రచారంతో అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter