Maharashtra Results: మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పట్నించి ఇండియా కూటమి కావచ్చు మహా వికాస్ అఘాడి కావచ్చు ఇదే ఆరోపణలు చేస్తోంది. ప్రత్యేకించి ఎన్నికల విధానాలు, ఈవీఎంల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్లలో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడీ కారణాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇండియా కూటమి.
మహారాష్ట్ర ఎన్నికలు మరోసారి చర్చనీయాంశమౌతున్నాయి. ఫలితాలు వెలువడి ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ వస్తున్న మహా వికాస్ అఘాడి నేతలు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమౌతున్నారు. ఎన్నికల కమీషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయనుంది. ఎన్నికల విధానాలతో పాటు ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణగా ఉంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్విల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
ఎన్నికల ప్రక్రియ, ఈవీఎం ప్రోటోకాల్‌లో ఆరోపించిన అవకతవకల్ని న్యాయస్థానంలో సవాలు చేసేందుకు చట్టపరమైన వ్యూహంపై నేతలు చర్చించారు. పోలింగ్‌కు మూడ్రోజుల ముందు ఓటర్లను తొలగించారని మరో ఆరోపణ. అధికార పార్టీ ఎన్నికల రిగ్గింగ్‌కు పాల్పడిందని, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రక్రియ తారుమారు చేశారని కూటమి ఆరోపించింది.
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పట్నించి మహా వికాస్ కూటమి నేతలు ఇదే ఆరోపిస్తున్నారు. తమ ఆరోపణలకు బలం చేకూర్చే డేటా, ఆధారాలున్నాయని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు.
Also read: Supreme Court On Freebies: ఇంకెంత కాలం ఉచితాలిస్తారు, సుప్రీంకోర్టు మండిపాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.