Maharashtra Holidays List 2026: 2026 ఏడాదికి గానూ మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు రోజులను ప్రకటించింది. అందుకు సంబంధించిన జాబితాను బుధవారం (డిసెంబరు 10)న అధికారికంగా విడుదల చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లు, కాలేజీలకు వర్తించే విధంగా మొత్తం 24 రోజుల సెలవు దినాలను మరాఠా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అదనంగా 2026 నవంబర్ 11న బుధవారం వచ్చే భౌబీజ్ నాడు ప్రత్యేక అదనపు ప్రభుత్వ సెలవును కూడా ప్రకటించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సెలవు దినాల జాబితాలో ప్రధాన పండుగలు, సాంస్కృతిక వేడుకలు, ముఖ్యమైన జాతీయ వేడుకలు ఉన్నాయి. ఈ సెలవుల జాబితా విడుదల చేయడం ద్వారా ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగులు ఏడాది పొడవునా ఒకే విధమైన సెలవులు పొందేలా చూసుకుంటారు. ప్రభుత్వం విడుదల చేసిన సెలవు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాలు, గ్రామ పంచాయితీలు, నగర పంచాయితీలు సహా మహారాష్ట్రలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేతగా ఉండనున్నాయి.
దీపావళి ఉత్సవాల్లో భాగంగా.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు తమ మధ్య బంధానికి ప్రతీకగా జరుపుకునే ముఖ్యమైన పండుగ భౌబీజ్‌కు దాని సాంస్కృతిక ప్రాముఖ్యత కల్పించడం ఇప్పుడు విశేషంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విస్తృతంగా పాటించడాన్ని పరిగణనలోకి తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదనపు సెలవు దినం మంజూరు చేసింది. ఈ చర్యను రాష్ట్ర ఉద్యోగులు స్వాగతించడం సహా తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు.
విడుదల చేసిన ప్రభుత్వ సెలవు దినాలతో పాటు.. బ్యాంకులకు ప్రత్యేకంగా ఏప్రిల్ 1, 2026 (బుధవారం) ను ప్రత్యేకంగా బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించింది. ఇది వార్షిక ఆర్థిక ముగింపు, ఆడిట్ కార్యకలాపాలకు కేటాయించినది. కాబట్టి ఆ రోజున బ్యాంకులకు మరో సెలవుల రానుంది.
మహారాష్ట్ర పబ్లిక్ హాలిడేస్ 2026 జాబితా...
గణతంత్ర దినోత్సవం - జనవరి 26, 2026 (సోమవారం)
మహాశివరాత్రి - ఫిబ్రవరి 15, 2026 (ఆదివారం)
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి – ఫిబ్రవరి 19, 2026 (గురువారం)
హోలీ (రెండవ రోజు) - మార్చి 3, 2026 - (మంగళవారం)
గుడి పడ్వా - మార్చి 19, 2026 (గురువారం)
రంజాన్ ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) – మార్చి 21, 2026 (శనివారం)
శ్రీరామ నవమి - మార్చి 26, 2026 (గురువారం)
మహావీర్ జయంతి – మార్చి 31, 2026 (మంగళవారం)
గుడ్ ఫ్రైడే - ఏప్రిల్ 3, 2026 (శుక్రవారం)
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి – ఏప్రిల్ 14, 2026 (మంగళవారం)
మహారాష్ట్ర దినోత్సవం - మే 1, 2026 (శుక్రవారం)
బుద్ధ పూర్ణిమ - మే 1, 2026 (శుక్రవారం)
బక్రీ ఈద్ (ఈద్-ఉల్-జుహా) – మే 28, 2026 (గురువారం)
మొహర్రం - జూన్ 26, 2026 (శుక్రవారం)
స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15, 2026 (శనివారం)
పార్సీ నూతన సంవత్సరం (షాహెన్‌షాహి) - ఆగస్టు 15, 2026 (శనివారం)
ఈద్-ఎ-మిలాద్ - ఆగస్టు 26, 2026 (బుధవారం)
గణేష్ చతుర్థి - సెప్టెంబర్ 14, 2026 (సోమవారం)
మహాత్మా గాంధీ జయంతి - అక్టోబర్ 2, 2026 (శుక్రవారం)
దసరా - అక్టోబర్ 20, 2026 (మంగళవారం)
దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ) - నవంబర్ 8, 2026 (ఆదివారం)
దీపావళి (బలిప్రతిపాద) - నవంబర్ 10, 2026 (మంగళవారం)
గురునానక్ జయంతి – నవంబర్ 24, 2026 (మంగళవారం)
క్రిస్మస్ – డిసెంబర్ 25, 2026 – (శుక్రవారం)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook








