Mahila Samman Yojana: మహిళలకు శుభవార్త, ఇక ప్రతి నెలా మీ ఎక్కౌంట్లో 1000 రూపాయలు, ఎలా అప్లై చేయాలి
Mahila Samman Yojana: మహిళలకు శుభవార్త, మహిళా సమ్మాన్ యోజనలో భాగంగా మహిళల ఎక్కౌంట్లో ప్రతి నెలా డబ్బులు పడనున్నాయి. మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి అధికారికంగా ఈ పధకాన్ని లాంచ్ చేయనున్నాయి. ఏ రాష్ట్రంలో, ఎప్పట్నించనేది తెలుసుకుందాం.
Mahila Samman Yojana: ఢిల్లీ ప్రభుత్వం మహిళా సమ్మాన్ యోజనను మరో వారంలో రోజుల్లో అధికారికంగా లాంచ్ చేయనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి త్వరలో అంటే 7-10 రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ పధకం ప్రకారం నెలకు 1000 రూపాయలు మహిళల ఎక్కౌంట్లో జమ కానున్నాయి.
ఢిల్లీలో మహిళలకు గుడ్‌న్యూస్. ఆప్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ యోజన లాంచ్ చేయనుంది. మరో వారంలో రోజుల్లో ఈ పధకం ప్రారంభం కానుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తోందని ముఖ్యమంత్రి అతిషి తెలిపారు. వచ్చే ఏడాది మార్చ్ 31 నాటికి మహిళలకు 1-2 నెలలు లబ్ది కూడా అందుతుందని చెప్పారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా లాంచ్ చేశారు. త్వరలో అంటే జనవరి నుంచి మహిళల ఎక్కౌంట్లో డబ్బులు పడనున్నాయి.
రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ మరోసారి అధికారంలో వస్తే ఈ పధకం కింద మహిళలకు ఇచ్చే వేయి రూపాయలు 21 వందలకు పెంచనున్నామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మహిళల స్వయం ఉపాధికి ఈ డబ్బులు చేయూత అందిస్తాయన్నారు. ప్రతిపక్షాలు ఈ పధకం అమలు కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇచ్చిన హామీని అమలు చేశామన్నారు.
మహిళా సమ్మాన్ యోజన్ అర్హులెవరు
ప్రతి మహిళ ఢిల్లీ ఓటరు అయుండాలి. మహిళ వార్షిక ఆదాయం 2.5 లక్షలు మించకూడదు. ఈ పధకం లబ్ది పొందేందుకు మహిళకు 18 నుంచి 60 ఏళ్ళ వయస్సుండాలి. ఎందుకంటే 60 ఏళ్లు దాటితే ఇతర పథకాలు వర్తిస్తాయి. కారు ఉంటే ఈ పధకం వర్తించదు. ఈ పధకం కోసం దరఖాస్తు చేసేందుకు ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్‌కం సర్టిఫికేట్ అవసరమౌతాయి.
ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా
ఢిల్లీ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి మహిళా సమ్మాన్ యోజన అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. సంబంధిత అధికారులు మీ దరఖాస్తు పరిశీలించి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేస్తారు. వెరిఫికేషన్ అనంతరం అర్హులని తేలితే నెలకు వేయి రూపాయలు మీ ఎక్కౌంట్లో జమ అవుతాయి.
Also read: PF Money Withdrawal: పీఎఫ్ నగదు అడ్వాన్స్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.