man arrested with dozens of venomous cobra snakes mumbai airport: సాధారణంగా మనం తరచుగా ఎయిర్ పోర్టులలో బంగారం, డైమండ్ లను సీక్రెట్ గా రవాణా చేసే వాళ్లను తరచుగా చూస్తుంటాం. ప్రైవేటు ప్రదేశాల్లో, లోదుస్తులలో, శరీరంకు ప్లాస్టర్ లను పెట్టుకుని మరీ కొంత మంది బంగారంను రవాణాలు చేస్తుంటారు. అయితే.. చాలా వరకు కస్టమ్స్ అధికారులు వీళ్లను అడ్డంగా పట్టుకుని మరీ అరెస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి.
అదే విధంగా ఇటీవల కాలంలో పాముల్ని సైతం అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొంత మంది పాముల్ని పట్టుకుని మరీ ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో.. సరీసృపాల జాతికి చెందిన అరుదైన పాములను ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. థాయిలాండ్ నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి అధికారులు వీటిని సీజ్ చేశారు.
వీటిల్లో.. నలభైకి పైగా అరుదైన స్పైడర్ టెయిల్ హార్న్డ్ వైపర్స్, ఏసియన్ లీఫ్ టర్టల్స్, పిట్ వైపర్స్, కోబ్రా రేర్ స్నేక్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతడ్ని సీక్రెట్ గా అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు సీక్రెట్ ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారు.
అయితే.. కస్టమ్స్ అధికారులు ఇతను గత నెల వ్యవధిలో రెండు నుంచి మూడు మార్లు ఇతర దేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. ఇతనికి పాములను అక్రమంగా రవాణా చేసే వారితో సంబంధాలుఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు.
మొత్తంగా పాముల్ని కొంత మంది ఇటీవల ఆహారంగాను, వాటి రక్తన్ని ముఖాలకు సౌందర్యానికి పోషకంగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాముల అక్రమ రవాణా అంశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









