)
Man Beheaded Wife And Lover: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య తనను మోసం చేసింది అనే అనుమానంతో భార్యతో పాటు ప్రియుడిని నరికేశాడు ఒక భర్త. 48 ఏళ్ల కోలాంజి అనే వ్యక్తి తన భార్య లక్ష్మీ (37)ను ప్రియుడు తంగరుసు అనే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉన్నారని అనుమానంతో ఇద్దరు తలలు నరికేశాడు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోలీసుల ప్రకారం మలై కొట్టడం నివాసి ఆయన కోలాంజి తన రెండో భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా లక్ష్మీకి అక్రమ సంబంధం ఉంది అనే అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇంటి పైనే లక్ష్మీ ఆమె ప్రియుడు అయిన తంగరుసు మాట్లాడుతుండగా వారిని చూసి తీవ్ర కోపోద్రీక్తుడు అయిన కోలంజీ కొడవలి తీసుకుని వారి తలలు నరికేశాడు. అంతేకాదు మృతదేహాలను రక్తపు మడుగులో అక్కడ వదిలేసి ఆ రెండు తలలను కూడా స్థానిక జైలు వద్దకు తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోయారు. వెంటనే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలకు తరలించారు.
ఇక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న వరంజరం పోలీసులు వెంటనే రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరో ఘటనలో..
ములుగు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. సొంత మేనత్తను మద్యానికి బానిస అయిన వ్యక్తి గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపాడు. ములుగు జిల్లా వెంకటాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మేనత్త ఎల్లమ్మ (50) అదే గ్రామానికి చెందిన మేనల్లుడు విజయ్ మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపాడు. అయితే అతను మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆరు బయట కూర్చున్న ఆమెపై అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఎల్లమ్మను స్థానికులు చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అప్పటికే ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. వెంటనే నిందితుడు కూడా పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook