Sleeper Coach In To Bathroom Video: సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చివరికి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఒక్కొక్కరికి యాక్సిడెంట్లు, అనుకోని ప్రమాదాలు కూడా జరిగినా అదే తంతు కొనసాగుతూ ఉంది. ఇటీవల ఓ యువకుడు రైలు కోచ్‌లో స్నానం చేస్తూ వైరల్ అవ్వడానికి ప్రయత్నించాడు. అది కాస్త బెడిసి కొట్టింది. రైలులో బకెట్, మాగ్గు, షాంపుతో హాయిగా స్నానం చేస్తూ కనిపించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆర్పీఎఫ్ పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ఈ వీడియో వీరంగానే లక్ష్మీబాయి ఝాన్సి స్టేషన్లో జరిగింది 'వోక్ ఎమినెంట్' అనే ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ అయింది. దీనికి ఇప్పటికే లక్షలు వ్యూస్ కూడా వచ్చాయి. ఇది నెట్టింట వైరల్ కావడంతో రైల్వే అధికారులు అతనిపై చర్యలు కూడా తీసుకున్నారు. ఒక వ్యక్తికి స్నానం చేస్తూ కనిపించాడు వైరల్ కావడానికి అతడు చేసిన ప్రయత్నం ఈసారి బెడిసి కొట్టింది. కేవలం లోదుస్తులతో స్నానం చేస్తూ కనిపించడంతో రైల్లో ఇతర మహిళలు కూడా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక యువతి కూడా దూరంగా ఉండి కనిపించడం ఇతరులు ప్రయాణికులు చూసి ఆశ్చర్యపోవడం వంటివి జరిగాయి అయితే దీనిపై ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు వెంటనే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు.
Gems Of Railways
Man taking bath in a train pic.twitter.com/9h0iLlVwsz
— Woke Eminent (@WokePandemic) November 8, 2025
ఆ యువకుడిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా రైల్వే అధికారులు తెలియజేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలవడానికి తను చేసిన ప్రయత్నం చేశానని సదరు యువకుడు ఒప్పుకుననాడు. అయితే, ఇలాంటి చర్యలు ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తుంది. కాబట్టి చర్యలు తీసుకున్నారు రైల్వే అధికారులు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు కూడా తెలియజేశారు.
Read more: రైలులో లోయర్ బెర్త్ కావాలా? టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ఈ తప్పు చేయకండి! వీడియో..
Read more: విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్.. నవంబర్ 14 శుక్రవారం స్కూళ్లన్నీ బంద్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









