Himachal Pradesh Land Slides: హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, బిలాస్‌పూర్ జిల్లాలోని ఝండుట ప్రాంతం సమీపంలోని భల్లు వంతెన వద్ద ‘సంతోషి ట్రావెల్స్’కు చెందిన బస్సు ప్రయాణిస్తుండగా, కొండ పైభాగం నుంచి అకస్మాత్తుగా పెద్ద ఎత్తున రాళ్లు, మట్టి కూలిపోయాయి. బస్సుపై నేరుగా పడటంతో వాహనం శిథిలాల కింద పూర్తిగా నలిగిపోయింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
రక్షణ చర్యలు ప్రారంభమైన వెంటనే పోలీసులు, NDRF, SDRF బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను సజీవంగా రక్షించగా, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు స్పందన
ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “బిలాస్‌పూర్ జిల్లాలోని భల్లు వంతెన సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన ఎంతో బాధాకరం. ఒక ప్రైవేట్ బస్సు కొండచరియల కింద చిక్కుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. రక్షణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. పూర్తి యంత్రాంగాన్ని మోహరించాలని అధికారులకు ఆదేశించాను,” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. “దేవుడు మరణించిన వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని, వారి కుటుంబాలకు బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం వారితో ఉంటుంది” అని తెలిపారు.
बिलासपुर ज़िला के झंडूता विधानसभा क्षेत्र के बालूघाट (भल्लू पुल) के पास हुए भीषण भूस्खलन की ख़बर ने मन को भीतर तक झकझोर दिया है।
इस भारी भूस्खलन में एक प्राइवेट बस के चपेट में आने से 10 लोगों के निधन का दु:खद समाचार मिला है और कई अन्य के मलबे में दबे होने की आशंका है। रेस्क्यू… pic.twitter.com/GBZslb36CP— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) October 7, 2025
ప్రధానమంత్రి మోదీ సంతాపం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బిలాస్‌పూర్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటనలో, “హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం బాధాకరం. బాధిత కుటుంబాల పట్ల నా హృదయపూర్వక సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. అలాగే, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
Saddened by the loss of lives due to a mishap in Bilaspur, Himachal Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next…
— PMO India (@PMOIndia) October 7, 2025
https://apple. ఆపిల్ లింక్ - https://bit.ly/3P3R74Uస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ -









