Maoism:మావోయిస్టుల ఖేల్ ఖతం.. ఆపరేషన్ కగార్ తో దుక్నం బంద్..

Maoism: సాయుధ ఉద్యమం పేరుతో అడవిబాట పట్టిన మావోయిస్టులు కనుమరుగవుతున్నారు. పోరాట పంధాతో కొంతమంది నేలకొరిగపోగా…. పొరాటయోధులు ఆయుధాలను పక్కనబెట్టి ప్రభుత్వాలకు సరెండర్ అవుతున్నారు.  కొత్త యేడాదిలో అడవిలో తుపాకుల అలజడి ఉండబోదనే సంకేతాలొచ్చాయి. ఇంతకీ అడవిలో తుపాకుల అలజడి ఏంటి? మావోయిస్టుల్లో వచ్చిన మార్పు ఏంటి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? జీ తెలుగు న్యూస్ స్పెషల్.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 5, 2025, 07:30 AM IST
Maoism:మావోయిస్టుల ఖేల్ ఖతం.. ఆపరేషన్ కగార్ తో దుక్నం బంద్..

పట్టువదలకుండా అడవిలోనే ఉన్న మావోయిస్టు  అగ్రనేతలు అనుచరులతో  సామూహికంగా లొంగిపోతామని ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీకంటే ముందుగానే… ఆపరేషన్ కగార్ లక్ష్యానికి చేరువైంది.ప్రజా అభ్యుదయం కోసం పుట్టుకొచ్చిన నక్సల్ బరి ఉద్యమం...కాలక్రమంలో మావోయిస్టుల పోరాటం.. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను కంటిమీద కునుకులేకుండా చేశాయి. గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం… అభివృద్ధిలేమి…పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రశ్నించేందుకు ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించడం కాదు. బెదిరింపు లేఖలతో హెచ్చరికలు చేసేవారు. ఖాతరు చేయని పక్షంలో ప్రభుత్వ ప్రతినిధులను, అధికారులను, మంత్రులను మట్టుబెట్టేందుకు వెనుకాడేవారు కాదు. రోజులు మారే క్రమంలో నక్సలైట్లని, మావోయిస్టులని పేరుమారినా.. ఉద్యమ పంధా ఒక్కటే… ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ నిర్ణయాలను తరచూ తప్పుబడుతూ నక్సలైట్లు ఆగ్రహాన్ని.. బాంబు పేలుళ్లతో నిరసన తెలిపేవారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ సంబంధ అధికారులను అడవుల్లోకి తీసుకెళ్లి హతమార్చేవారు. మరి కొందరిని కొందరిని హెచ్చరించి పంపేసేవారు.

Add Zee News as a Preferred Source

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజా ఉద్యమం పేరుతో నక్సలైట్లు పుట్టుకొచ్చారు. 1967లో పశ్చిమ బెంగాల్‌ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో సాయుధ రైతాంగ తిరుగుబాటు నుంచి 'నక్సల్' అనే పదం వచ్చింది. వీళ్లంతా కమ్యూనిజం సిద్ధాంతకారుడు కార్ల్‌మార్క్స్‌ ఐడియాలజీను అనుసరిస్తారు. అదే సమయంలో మావో, లెనిన్‌ సిద్ధాంతాలను కూడా ఫాలో అయ్యారు. తిరుగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌, తెలంగాణ, ఒడిషాలోనూ ప్రజా ఉద్యమం పురుడుపోసుకుంది.

నిజాం నియంతృత్వపు పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోసం, భూస్వామ్య పెట్టుబడిదారీ విధానం, వెట్టిచాకిరి విధానాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాడు మావో సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడారు. 1950 నాటికే దేశంలో మావో ఐడియాలజీ వ్యాప్తిలో ఉంది. 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వాడే మావో. ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి ప్రభుత్వాలపై దండయాత్ర చేసిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మనం పిలుస్తున్న మావోయిస్టులు భారతీయ చట్టాల ప్రకారం ఓ నిషేధిత ముద్రవేశారు.

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

1980 దశకంలోనే అప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ కార్యదర్శి కొండపల్లి సీతారామయ్య పార్టీ కీలకనేతల్ని దండకారణ్యం బాట పట్టించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర కమిటీతోపాటు ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కమిటీలుండేవి. ఆయా ప్రాంతాల్లోని అడవుల్లో పార్టీ క్యాడర్‌ క్రియాశీలంగా వ్యవహరించేది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో నిర్బంధం పెరిగితే మహారాష్ట్రలోని గడ్చిరోలితోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యమే తమకు సురక్షిత స్థానమవుతుందని ఆనాడే కేఎస్‌ గ్రహించారు. అందుకే తొలుత గడ్చిరోలిలోకి.. ఆపై దండకారణ్యంలోకి దళాలను పంపించారు. 

సమాజాన్ని ఉద్ధరిద్ధామని విద్యావంతులు, మేధావులు మావోయిస్టు ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ఇంజినీరింగ్, పీహెచ్‌డీ వంటి ఉన్నత చదువులు వదిలేసి విప్లవాల వైపు అడుగులు వేసిన వారు మావోయిస్టుల్లో చేరారు. నంబాల కేశవరావు , మల్లోజుల వేణుగోపాల్ రావు , బర్సా దేవా, హిడ్మా వంటి వారు ఆ ఉద్యమాన్ని బలంగా ముందుకు నడిపారు. అయితే, కొన్నాళ్లుగా ఇటువంటి వారిని మావోయిస్టులు రిక్రూట్‌మెంట్‌ చేసుకోలేకపోయారు. దీంతో క్రమంగా ఉద్యమం బలహీనపడుతూ రావడానికి ఇది కూడా పరోక్షంగా కారణమైంది. కేఎస్‌ ఊహించినట్లుగానే శాంతిచర్చల అనంతరం 2007 ప్రాంతంలో నల్లమలను పోలీసులు జల్లెడ పట్టడంతో క్రమేపీ ఉమ్మడి రాష్ట్రంలో పట్టు కోల్పోయింది. అప్పట్లో రాష్ట్ర కార్యదర్శి బుర్ర మాధవ్‌ ఎలియాస్‌ చిన్నన్నను నల్లమలలోనే గ్రేహౌండ్స్‌ బలగాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చడంతో మావోయిస్టు దళాలన్నీ దండకారణ్యానికే తరలిపోయాయి. 

దండకారణ్యంలో మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతో 2010 దశకం తొలినాళ్లలోనే ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ ప్రారంభమైంది. అనంతరం ఆపరేషన్‌ ప్రహార్‌ సాగింది. అయితే ఆ రెండు ఆపరేషన్లను మావోయిస్టు పార్టీ ఎదుర్కొని నిలిచింది. అలాగే మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేత మహేంద్ర కర్మ నేతృత్వంలో ఏర్పాటైన ప్రైవేట్‌ సైన్యం ‘సల్వాజుడుం’నూ సమర్థంగా తిప్పికొట్టింది. 2021 నవంబరులో గడ్చిరోలి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహారాష్ట్ర-మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ జోన్‌ను పర్యవేక్షిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుమ్డేతో సహా 26 మంది మావోయిస్టులు మృతిచెందడటంతో దండకారణ్యమే ఆఖరి గమ్యస్థానంగా మారింది.

సాయుధ పోరాటంతో నక్సలైట్లు… మావోయిస్టులు అడవుల్లో రక్తపుటేర్లను ప్రవహింపజేశారు.  పారిశ్రామికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని, పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసే రాష్ట్రప్రభుత్వాల చర్యలను సాయుధపోరాట యోధులు తప్పుపట్టేవారు. కేంద్ర మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు జారీతో సంచలనం సృష్టించేవారు.  దశాబ్ధాలుగా సాగిన ఉద్యమంలో ఎందరో నేతలు పుట్టుకొచ్చారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడారు. నక్సల్ ఉద్యమం ముసుగులో ప్రభుత్వాలపై కక్షపెంచుకున్న ఉద్యమకారులు.. అమాయకులను బలితీసుకున్నారు. పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు నక్సల్స్ తొపాకుల తూటాలకు బలయ్యారు. అక్కడక్కడ మందుపాతరలతో పేల్చి విధ్వంసం సృష్టించారు. రాజకీయ నాయకులను అడవులకు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేసిన ఉదంతాలు సంచలనం రేకెత్తించాయి.

నక్సలైట్ల ఘాతుకానికి బలైన వారిలో అత్యధికులు పోలీసులు కాగా… పోలీసులకు సమాచారం అందించారని ఇన్ ఫార్మర్లపేరుతో అమాయకులను దారుణంగా కాల్చి చంపేశారు. ఈదారుణాలతో ప్రభుత్వాలనే కాదు.. అడవీప్రాంత ప్రజానీకాన్ని భయపెట్టాయి. గ్రామాల్లో ఉన్నవారు భయపడుతూ.. నక్సలైట్లకు ఆశ్రయిం కల్పించాలి. అన్నిసౌకర్యాలను సమకూర్చాలి. సమీప బ్యాంకులను దోపిడీ చేయడం, పారిశ్రామిక వేత్తలను, పెద్ద పెద్ద భూ స్వాములను, కాంట్రాక్టర్లను, రాజకీయ నాయకులను బెదిరించి ఆర్థిక వనరులు సమకూర్చుకునేవారు. మాటవినకుండా.. చందాలు ఇవ్వని వారిని ప్రాణాలు తీసేవిషయంలో వెనుకాడేవారు కాదు. మావోయిస్టుల మాట వింటేనే జీవితం.. వ్యతిరేకిస్తే మరణమే శాసనంగా అమలుచేశారు. ప్రస్తుతం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో అది మరణ శయ్యపై ఉందనే చెప్పాలి. 

(రచయత..మునిరాజ్ జీ న్యూస్ డెస్క్)

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News