)
Maoist Mallojula Venugopal: మావోయిస్టు పార్టీలో పెను ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. ఆయన విడుదల చేసిన లేఖ ఇప్పుడు మావోయిస్టు పార్టీలోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వేణుగోపాల్ తన లేఖలో.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పదవిలో కొనసాగడం సమంజసం కాదని, ఇక పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. సాయుధ పోరాటం మార్గం సరిగా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు పార్టీ అనుసరించిన పంథా తప్పిదాలతో నిండిపోయింది. ఆ దారిలో కొనసాగడం వల్ల ఉద్యమానికి నష్టం కలిగింది అని పేర్కొన్నారు.
తాను నాయకుడిగా ఉన్న కాలంలో జరిగిన పొరపాట్లకు బాధ్యత వహిస్తూ, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కోరారు. పోరాటం విఫలమైందని కాదు, కానీ దిశ తప్పిపోయింది. జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం ఇప్పుడు చాలా అవసరం అని లేఖలో పేర్కొన్నారు. ఉద్యమం నిలదొక్కుకోవాలంటే ఆత్మపరిశీలన తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.
వేణుగోపాల్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సాయుధ పోరాటం ద్వారా లక్ష్యాలను సాధించడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడడం కంటే, పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం ముఖ్యం. అనవసర త్యాగాలకు ఇక ముగింపు పలకాలనే సమయం వచ్చిందని ఆయన హితవు పలికారు.
తన నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నది కాదని, పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చానని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జీవించి ఉన్నప్పుడే ఈ అంశంపై చర్చలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. పార్టీ అధికార ప్రతినిధి జగన్‌పై కూడా వేణుగోపాల్ తీవ్ర విమర్శలు చేశారు.
చివరగా ఆయన పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తప్పవు అని సూచించారు. వేణుగోపాల్ రాజీనామా లేఖతో మావోయిస్టు వర్గాల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి. భవిష్యత్‌లో పార్టీ దిశ ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.