Maoists Killed in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సూక్మా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు అంతం చేసినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఉపంపల్లిలోని గోగుండా కొండ మీద కాల్పులు జరిగాయి. ప్రస్తుతం కూడా ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి అలజడి రేగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది వరకు మావోలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారుజాము వీరి ఇరువురు మధ్య కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో భారీ దెబ్బ మావోయిస్టులకు తగిలింది. ఎక్కువ మొత్తంలో మృతి చెందారు. సూక్మా జిల్లా అటవీ ప్రాంతంలో ఈ కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు (CRPF)లకు తెల్లవారుజామున మావోయిస్టులో తారసపడ్డారు. కాల్పులు మొదలయ్యాయి. ఇక మావోయిస్టులు ఉన్న ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. శుక్రవారం నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు ఇంప్రూవైజ్డ్ డివైస్ పెలడంతో ఒక జవాన్ కూడా గాయపడిన సంగతి తెలిసిందే.
దండకారణ్యంలో గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు కనిపించాయి. కెర్లాపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్‌తో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న భారీ ఆయుధాలను, పేలుడు పదార్థాలను కూడా భద్రతా బలగాలు స్వాధీన పరుచుకున్నారు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.
జనవరి నెలలో కూడా భద్రత బలగాలు మావోయిస్టులకు జరిగిన కాల్పులు 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఫిబ్రవరి బీజాపూర్ లో 31 మంది చనిపోగా.. సరిహద్దుల్లో మార్చి 21 తేదీన భారీఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. హోం మంత్రి అమిత్ షా ఆపరేషన్ కాగర్ పేరిట మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే, మావోయిస్టులు పెద్ద ఎత్తున ఈ చర్యలను ఖండిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి లేఖ కూడా విడుదల చేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 75 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు.
ALSO READ: Viral Video: హీరోయిన్ కసికసిగా ఉంది.. మల్లారెడ్డి కామెంట్స్ వైరల్..
ALSO READ: Today Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశికి ఎలా ఉంటుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









