Banks Bandh: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌! ఎప్పుడు? ఎందుకో తెలుసా?

Bank Services Close For Four Days When And Why: బ్యాంకింగ్‌ సేవలు వరుసగా నాలుగు రోజుల పాటు స్తంభించనున్నాయి. వరుసగా రెండు రోజుల సెలవులు ఉండగా వాటికి అదనంగా మరో రెండు తోడవుతుండడంతో నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 20, 2025, 03:02 PM IST
Banks Bandh: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌! ఎప్పుడు? ఎందుకో తెలుసా?

All Banks Strike: బ్యాంకులు వరుసగా మూత పడనున్నాయి. బ్యాంకు వినియోగదారులకు షాక్‌ కానుండగా బ్యాంకు ఉద్యోగులకు పండుగే. వరుస సెలవులు రావడంతో వినియోగదారులు, ఖాతాదారులు ముందే అప్రమత్తమైతే మంచిది. లేకపోతే బ్యాంకింగ్‌పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే నాలుగు రోజుల పాటు బ్యాంకులు ఎందుకు మూత పడనున్నాయో తెలుసుకుందాం. ఎప్పుడు? ఎక్కడ అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: GATE 2025 Results: గేట్‌ 2025 ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డులు తెలుసుకోవడం ఇలా!

బ్యాంకులు నాలుగు రోజుల పాటు బంద్‌ కానున్నాయి. యథావిధిగా నాలుగో శనివారం, ఆదివారంతోపాటు రెండు సెలవులు రానుండగా ఆ తర్వాతి రెండు రోజులు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. దీంతో నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. మార్చి 22వ తేదీన నాలుగో శనివారం, 23న ఆదివారం సెలవులు ఉండగా.. మార్చి 24, 25వ తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు.

Also Read: 100 KG Gold Seize: వంద కిలోల బంగారం సీజ్‌.. ఎందుకు? ఎంత విలువ తెలుసా?

బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంక్ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మెతో భారత ఆర్థిక రంగం స్తంభించనుంది. ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు కూడా పాల్గొననుండడం విశేషం. వచ్చే వారంలో బ్యాంకుల సమ్మె అయినప్పటికీ ముందు నుంచే అంటే మార్చి 22వ తేదీ నుంచే బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. మార్చి 22న నాలుగో శనివారం, తరువాత ఆదివారం బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అనంతరం మార్చి 24, 25 (సోమ, మంగళవారం) బ్యాంకుల సమ్మె నేపథ్యంలో దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది.

బ్యాంకుల సమ్మెతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ముందే శుభకార్యాలు, పంట కాలం కావడంతో డబ్బుల కోసం ప్రజలు, రైతులు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంది. అయితే నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రజల పనులు ఆలస్యం కానున్నాయి. అయితే బ్యాంకులు బంద్‌ ఉన్నా కూడా డిజిటల్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని బ్యాంకింగ్‌ సేవలు పొందవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News