)
Married Man tries to kiss ex girl friend she bites off his tongue in Kanpur: ఇటీవల కాలంలో కొంతమంది పెళ్లి చేసుకుని కూడా పక్క చూపులు చూస్తున్నారు. ముఖ్యంగా కొంత మంది భార్య భర్తలు పెళ్లిళ్లు చేసుకుని మరీ ఒకరికి తెలియకుండా మరోకరు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. కట్టుకున్న వాళ్లతో అన్యోన్యంగా ఉండే బదులు.. వాళ్లను ఎలా చంపాలో స్కెచ్ లు వేస్తున్నారు. మొత్తంగా ఇలాంటి ఘటనలు ఇటీవల మరీ ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఇక మరోవైపు పెళ్లికాకముందు యువతీ,యువకులు చేస్తున్న ఘోరాల్ని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పెళ్లికాక ముందే సీక్రెట్ గా రోమాన్స్ లు చేసుకుంటున్నారు.
ఓయోలకు వెళ్లి పాడుపనులు చేస్తున్నారు. ఆ తర్వాత కొంత మంది ముఖం చాటేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా మనం వార్తలలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఖాన్ పూర్ లో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.
ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో దరియా గ్రామానికి చెందిన చంపీ అనే వ్యక్తికి ఒక యువతితో గత కొన్నేళ్లుగా ఎఫైర్ ఉంది. సీక్రెట్ గా ఇంట్లో వారికి తెలియకుండా యవ్వారం నడిపించేవాడు. ఇద్దరు తరచుగా కలసుకునేవారు. ఆ తర్వాత వీరి వ్యవహారం కాస్త పెద్దలకు తెలిసింది. అయితే.. ఆమెను పెళ్లి చేసుకొవడం యువకుడి ఇంట్లో ఇష్టంలేదు. దీంతో మరో యువతితొ చంపికి పెళ్లి జరిపించేశారు. పెళ్లి అయిన కూడా చంపీ తరచుగా యువతిని కలవాలని, మాట్లాడాలని ప్రయత్నించేవాడు.
దీంతో అప్పటి నుంచి యువతి తన ప్రియుడ్ని అవాయిడ్ చేస్తు వస్తుంది. ఆమెను పలుమార్లు కలవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతి అడవిలో పొయ్యి కోసం మట్టిని తీసుకొని రావడానికి చెరువు వద్దకు వెళ్లింది. అప్పుడు ఆమె ప్రియుడు ఆమెను ఫాలో అయ్యాడు.ఆమెతో మాట్లాడటానికిప్రయత్నించాడు.
ఇంతలో కక్కుర్తీ పడి ఆమెను ముద్దు పెట్టుకొవడానికి ప్రయత్నించాడు. తనను కాదని, మరో యువతితో పెళ్లి చేసుకుంటావా అని అసలే ఆమె కోపంగా ఉంది. ఆకోపంలో ఆమెను ముద్దుపెట్టుకొవడానికి ప్రయత్నించిన తన మాజీలవర్ నాలుకను యువతి గట్టిగా కొరికేసింది. దీంతో నాలుకలో కొద్ది భాగం తెగిపోయి కింద పడింది. దీంతో అతను బాధతో విలవిల్లాడిపోయాడు.
ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడివారు వెంటనే చంపీని ఆస్పత్రికి తరలించారు. విపరీతంగా రక్త స్రావం కావడంతో.. కాన్పూర్‌లోని ఒక పెద్ద ఆసుపత్రికి సిఫార్సు చేశారు. దీంతో అతనికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు యువతిపై కేసు నమోదు చేశారు.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి