
Married woman raped by father in law and relatives in gujarat: ఇటీవల కాలంలో సమాజంలో దారుణ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అసలు కొంత మంది అయితే వావివరుసలు మర్చిపోయి పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఆడది కన్పిస్తే చాలు.. కామంతో దారుణాలు చేస్తున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడంలేదు. మొత్తంగా ఇటీవల సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అసలు సమాజంలో మానవ సంబంధాలు ఉన్నాయా..?.. అన్న అనుమానం కల్గుతుంది.ఈ క్రమంలో గుజరాత్ లోని వడోదరలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన 40 ఏళ్ల వయసులో 2024 ఫిబ్రవరిలో మహిళలకు పెళ్లైంది. అయితే.. పెళ్లి తర్వాత భర్తతో పలుమార్లు భర్తతో శారీరకంగా కలిసిన గర్భంరాలేదు. దీంతో చివరకు ఐవీఎఫ్ ప్రయత్నాలు చేశారు. అది కూడా సక్సెస్ కాలేదు. ఒక రోజుమహిళ నిద్రలో ఉండగా.. ఆమె మామ వచ్చి అత్యాచారం చేశాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడానికి ప్రయత్నించడంతో ఆమెను కొట్టి.. తన వల్ల తన వంశానికి సంతానం కల్గుతుందని చెప్పి ఆమెను బెదిరింపులకు గురిచేశాడు.
చివరకు భర్తకూడా తనకు ఎదురు చేబితే.. న్యూడ్ ఫోటోలు, వీడియోలు బైట వైరల్ చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఆమె మామతో కూడా గర్భంరాలేదు. దీంతో ఈసారి మహిళ ఆడపడుచు భర్తను రంగంలోకి దింపారు. అతనితో కూడా రోజు లైంగిక సంబంధం పెట్టుకునేలాబలవంతం చేసేవారు.ఈ క్రమంలో కొన్నినెలల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. కానీ నెల తిరక్కుండానే గర్బస్రావం అయ్యింది.
దీంతో మరల వేధింపులు మొదలవ్వడంతో మహిళ భరించలేక ధైర్యం తెచ్చుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్మార్గులు చివరకు స్నేహితుడితో కూడా తన భార్యపై అత్యాచారం చేయించేందుకు ప్లాన్ లు వేశాడని వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా.. ఈ ఘటనపై పోలీసులు కూడా షాక్ కు గురౌతున్నారు. ప్రస్తుతం సమాజంలో మరీ ఇంతనీచపు పనులు జరుగుతున్నాయా..అని పోలీసులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను, మామను, ఆడపడుచు భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook