Sabarimala: శబరిమలలో మొదలైన మండల - మకరవిళక్కు యాత్ర.. తొలి రోజే భక్తుల రద్దీ..

Sabarimala- Mandala Makaravilakku Pooja: శబరిమలలో  శబరిమలలో మొదలైన మండల - మకరవిళక్కు యాత్ర.. తొలి రోజే భక్తుల రద్దీ నెలకొంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ముఖ్యంగా సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశంతో వృశ్చిక సంక్రాంతి మూలంగా  ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.    

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 17, 2025, 03:28 PM IST
Sabarimala: శబరిమలలో మొదలైన మండల - మకరవిళక్కు యాత్ర.. తొలి రోజే భక్తుల రద్దీ..

Sabarimala- Mandala Makaravilakku Pooja: గాడ్స్ ఓన్ కంట్రీ అయిన  కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజకు ముస్తాబయింది. ప్రధాన అర్చకుడి సమక్షంలో ఆదివారం నాడు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సాంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి నుంచి తీసుకువచ్చిన జ్వాలతో పదు నెట్టాంబడి వద్ద జ్యోతిని వెలిగించారు. ఆదివారమే ఆలయం తెరుచుకన్నప్పటికీ వృశ్చిక మాసాన్ని పురస్కరించుకుని ఇవాళ  తెల్లవారుజామున 3 గంటలకు అధికారికంగా భక్తులకు అనుమతిచ్చారు. 

Add Zee News as a Preferred Source

కొత్త పూజారులు తలుపులు తెరవడంతో తీర్థయాత్ర సీజన్ మొదలయింది. ఇక నేటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తున్నారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. 

మళ్లీ డిసెంబర్ 30న మకరవిలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు. ఈ 41 రోజులు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయ్యప్ప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో శబరిమలకు వెళ్లే రైల్లు కిక్కిరిసి పోతున్నాయి. 

Also Read:  ధర్మేంద్ర మొదటి భార్య ఎవరు..? విడాకులు ఇవ్వకుండానే ఎందుకు రెండో వివాహాం చేసుకున్నాడు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News