Chhattisgarh Encounter: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ ఏడాదిలో మరో భారీ ఎదురుదెబ్బ ఎదురైంది. మావోయిస్టుల ఏరివేతను తీవ్రతరం చేసిన భద్రతా బలగాలు మరో భారీ ఎన్‌కౌంటర్‌ను చేశాయి. మావోయిస్టుల అడ్డాగా ఉన్న చత్తీస్‌గడ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు వరుస విజయాలు పొందుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు నేలకొరిగారు. భద్రతా సిబ్బందిలో ఒకరు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ను మరో విజయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
Also Read: GATE 2025 Results: గేట్ 2025 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డులు తెలుసుకోవడం ఇలా!
ఛత్తీస్‌గడ్ దండకారణ్యం మరోసారి ఎరుపు రంగు పులుముకుంది. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో 22 మంది మావోయస్టులు హతమయ్యారు. నక్సలైట్లతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ భద్రతా సిబ్బంది మృతి చెందాడు. బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగలూరు ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు దాగి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ మొదలుపెట్టాయి.
Also Read: 100 KG Gold Seize: వంద కిలోల బంగారం సీజ్.. ఎందుకు? ఎంత విలువ తెలుసా?
అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుకాగా భద్రత బలగాలు కాల్పుకు తెగబడ్డాయి. పరస్పరం కాల్పులు చోటుచేసుకోగా మొత్తం 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ దాడుల్లో ఓ జవాన్ కాల్పుల్లో మరణించాడు. కాగా మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కంకేర్ జిల్లాలో డీఆర్‌జీ, బీఎస్‌ఎఫ్ సంయుక్తంగా చేపట్టిన జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 'ఎక్స్'లో స్పందించారు. భద్రతా బలగాలు మరో విజయాన్ని అందుకున్నాయని ప్రకటించారు. నక్సల్ విముక్త భారత్ కార్యక్రమాన్ని భదత్రా బలగాలు పటిష్టంగా చేపడుతుండడంతో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ రెండు సంఘటనలతో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది నుంచి ప్రారంభమైన మావోయిస్టుల ఏరివేత తీవ్రమవగా.. ఈ ఏడాది భద్రతా బలగాలు నక్సల్స్‌పై యుద్ధమే ప్రకటించాయి. ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులను నామరూపాలు లేకుండా చేయాలని కేంద్రం భారీ వ్యూహంతో ముందడుగు వేస్తోంది.
ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లు
- బీజాపూర్‌లోని జాతీయ పార్క్‌లో ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లు కాల్పుల్లో మరణించారు.
- ఎన్‌కౌంటర్‌లు తీవ్రరూపం దాల్చడంతో అరణ్యాన్ని వీడుతున్న మావోయిస్టుల సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరిలో 18 మంది నక్సలైట్లు నక్సలిజం వదిలేసి జనజీవనంలోకి వచ్చారు.2025లో మొత్తం 81 మావోయిస్టులను భద్రత దళాలు బలిగొన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









