Big Breaking: జమ్మూ కాశ్మీర్‌ బసంత్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. భారత జవాన్‌ వీరమరణం..

Jammu kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భారత భద్రత బలగాలు ఉగ్రవాదుల మధ్య నేడు తీవ్ర కాల్పులు జరిగాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Apr 24, 2025, 11:30 AM IST
Big Breaking: జమ్మూ కాశ్మీర్‌ బసంత్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. భారత జవాన్‌ వీరమరణం..

Jammu kashmir Encounter: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది.  ఈ నేపథ్యంలో భారత భత్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం బేస్‌ క్యాంపుల నుంచి అక్కడకు భారీగా అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

జమ్ము కాశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్ర మూకలను ఏరిపారేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో భారత ఆర్మీలో ఒకరు మృతి చెందారు. అక్కడ ముష్కరులు ఉన్నారని పక్కా సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టగా కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ సోల్జర్ మన మరణం పొందారు. ఈ నేపథ్యంలో భద్రత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ భీకర ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. హోం కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. భారత్ ,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నవేళ వీరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

 పాక్‌ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా నిలిపివేత..
ఈ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వ అధికార ట్విట్టర్ ఖాతాను కూడా భారత్ బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ పేజీని ఓపెన్ చేస్తే 'విత్ హెల్డ్‌' అని చూపిస్తోంది. పాక్‌తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసివేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలతో పాటు దౌత్య సంబంధాన్ని కూడా కట్ చేసింది. ఇటు సింధు జలాల ఒప్పందాన్ని కూడా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నెట్టింటా కూడా పాక్‌కు యాక్సెస్ లేకుండా పోయింది .

 అయితే ఉగ్ర దాడి నేపథ్యంలో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బుకింగ్స్ 90% వరకు రద్దు చేసుకుంటున్నారు. ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీలు మేరకు వెల్లడించాయి. పర్యాటకం కోసం అక్కడకు వచ్చినవారు కూడా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ముష్కరుల దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున పర్యాటకులు క్యాన్సల్ చేసుకుంటున్నారు. 

ఇదీ చదవండి:  గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు.. తనకు కుటుంబానికి భద్రత కల్పించాలని ఫిర్యాదు..  

తిరుపతిలో హైఅలెర్ట్‌..
 జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైలెట్ ప్రకటించారు. సముద్ర తీరంలో ఉన్న ప్రాంతాలకు అదనపు బలగాలు మోహరించాయి. ప్రధానంగా రైల్వే స్టేషన్లు రద్దీ ఉండే ప్రాంతాలు, ఆలయాలు భద్రత కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలతో ఎప్పటికి అప్పుడు తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ భద్రత పెంచేశారు. ఘాట్‌ రోడ్‌ గుండా వెళ్తున్న వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.

ఇదీ చదవండి: సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి? కేంద్రం నిర్ణయంతో పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News