Guwahati Chennai indigo flight diverted to Bengaluru due to low fuel: ఇటీవల ఇండిగో ఎయిల్ లైన్స్ కు చెందిన వరుస ఘటనలు తెగ టెన్షన్ తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన యావత్ భారతావణిని కలిచి వేసింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కవ్యక్తి తప్ప.. అందరు దుర్మరణం చెందారు.
ఈ ఘటన జరిగిన తర్వాత ప్రతిరోజు విమానంలో సాంకేతిక సమస్యల ఘటన వార్తలలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుంతం మరో ఇండిడో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం పైలట్ అప్రమత్తం కావడంతో.. ప్రమాదంలో నుంచి వెంట్రుక వాసిలో బైటపడింది. గువహటి నుంచి చెన్నై వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గువహటి నుంచి ప్రయాణికులతో ఇండిగో విమానం చెన్నైకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో ఇంధనంన తక్కువగా ఉందని పైలట్ గుర్తించాడు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు.. 'మేడే' సందేశాన్ని పంపాడు. దీంతో విమానంలో ఉన్న వారు ఒక్కసారిగా టెన్షన్ కు గురయ్యారు.
దీనిపై స్పందించిన ఏటీసీ.. సమీపంలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో పైలట్.. చాకచక్యంగా వ్యవహరించి, విమానాన్ని బెంగళూరులో సురక్షితంగా దించారు. దీంతో విమానంలో ఉన్న దాదాపు.. 170 మంది ప్రయాణికులు, సిబ్బంది బతికిపోయామని ఊపిరిపీల్చుకున్నారు.. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది. ప్రస్తుతం దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









