
Navy officer meerut murder case: ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో నేవీ అధికారి డ్రమ్ హత్య ఘటన దేశంలో సంచనంగా మారింది. ఈ ఘటనలో కట్టుకున్న భార్య ముస్కాన్ ప్రియుడి మోజులో పడి భర్తను 16 ముక్కలుగా నరికింది. అంతే కాకుండా.. ఒక డ్రమ్ ను కొనుగోలు చేసి దానిలో చెత్తను, మట్టిని నింపి మరీ దానిలో డెడ్ బాడీ ముక్కలు వేసి సిమెంట్ తో ప్లాస్టరింగ్ కూడా చేశారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు కూడా కులు,మనాలీకీ వెళ్లి అక్కడ హోలీ వేడుకలు జరుపుకున్నారు. సౌరబ్ రాజ్ పుత్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, కూతురు తన తండ్రి ఆ డ్రమ్ లో ఉన్నాడని చెప్పడంతో అనుమానంతో స్థానికులుపోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసుల విచారణలో ఈ దారుణం బైటపడింది.
ముస్కాన్ కు, సౌరభ్ రాజ్ పూత్ కు మధ్య.. 2016 లో ప్రేమ పెళ్లి జరిగింది. ఆతర్వాత వీరికి 2019 లో ఒక పాప పుట్టింది. సౌరభ్ రాజ్ పూత్ తన భార్య కోసం, తల్లిదండ్రులకు దూరమయ్యాడు. కానీ భార్య ముస్కాన్ మాత్రం.. అనూహ్యంగా తన స్కూల్ డేస్ లోని ఫ్రెండ్ సాహిల్ తో ఎఫైర్ పెట్టుకుంది. పలు మార్లు భర్త దీని విషయంలో చెప్పిచూశాడు .కానీ భార్యలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో తన కూతుర్ని భార్యదగ్గర వదిలేసి, ఉద్యోగంకు వెళ్లిపోయాడు. ప్రతినెల భార్యకు కూతురి కోసం డబ్బులు పంపేవాడు . ఇక్కడ భార్య, ప్రియుడితో రొమాన్స్ చేసుకుంటూ జల్సాలు చేసేది.
కొన్ని రోజుల క్రితం తన కూతురు బర్త్ డే కోసం సౌరభ్ వచ్చాడు. దీన్ని భార్య, ఆమె ప్రియుడు ఓర్చుకోలేక పోయాడు. అన్నంలో విషం పెట్టారు. అది తిని అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాక.. పదునైన ఆయుధాలతో కొట్టిచంపారు. అంతేకాకుండా... బాడీని 16 ముక్కలు చేసి డ్రమ్ లో వేశారు. ఈ ఘటనను సవాల్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేయగా.. ఘోరం అంతా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ లు రిమాండ్‌లో ఉన్నారు. జైల్లో వీళ్లిద్దరు తమకు డ్రగ్స్ ఇవ్వాలని ఇప్పటికే అధికారులతో గొడవకు దిగారు.
ఈ క్రమంలో తాజాగా..ముస్కాన్ ప్రెగ్నెంట్ అనే విషయం వైద్యుల టెస్ట్ లలో బైటపడింది. అయితే.. దీనికి ఎవరు కారణమై ఉండొచ్చని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. భర్తను చంపిన తర్వాత ప్రియుడితో కులూ,మనాలీలో రాసలీలల్లో మునిగిన సంగతి తెలిసిందే. కానీ ముస్కాన్ అరెస్ట్ తర్వాత జైల్లో కూడా కొంత మంది పోలీసులతో ఎఫైర్ పెట్టుకుందని కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ముస్కాన్ ప్రెగ్నెంట్ అంశంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారంట. మొత్తంగా ముస్కాన్ మాత్రం ఏదో ఒక కాంట్రవర్సీ అంశంతో వార్తలలో ఉంటూ రచ్చరాజేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe