Meerut Murder Case Video: ఛీ.. ఛీ.. భర్తను క్రూరంగా చంపి.. ప్రియుడితో మనాలీలో హోలీ సంబరాలు.. షాకింగ్ వీడియో..

Navy Officer case: మీటర్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పుత్ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కట్టుకున్న భార్య ప్రియుడితో ఎఫైర్ పెట్టుకుని భర్తను అత్యంత క్రూరంగా చంపేసింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 22, 2025, 07:08 PM IST
  • సంచలనంగా మారిన మీరట్ ఘటన..
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Meerut Murder Case Video: ఛీ.. ఛీ.. భర్తను క్రూరంగా చంపి.. ప్రియుడితో మనాలీలో హోలీ సంబరాలు.. షాకింగ్ వీడియో..

merchant navy officer murder incident video: మీరట్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం దేశంలో భార్యభర్తల రిలేషన్ కే సవాల్ విసిరేదిగా మారింది. ఈ క్రమంలో ముస్కాన్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సదరు మహిళను, ఆమె ప్రియుడ్ని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. సౌరభ్ రాజ్ పుత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముస్కాన్.. తన భర్త సౌరభ్ రాజ్ పుత్ కు తినే అన్నంతో నిద్ర మాత్రలు కల్పి పెట్టింది.

Add Zee News as a Preferred Source

దీంతో అతను తినగానే మత్తులోకి వెళ్లిపోయాడు. అప్పటికే అతడ్ని చంపేయాలని ప్లాన్ తో ఉన్న ముస్కాన్.. తన ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. ఇద్దరు అప్పటికే సిద్దంగా ఉంచుకున్న కత్తితో.. భర్తను గుండెల మీద, పొట్టలో ఇష్టమున్నట్లు పొడిచారు. మొత్తంగా భర్త గుండెల్లో మూడుసార్లు కసిగా పొడిచింది. శరీరంను  15 ముక్కలుగా వేరు చేశారు. పోస్టు మార్టంలో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. భర్తను చంపిన తర్వాత తన భర్త మొండెంను బెడ్ కింద పెట్టుకుని ఇద్దరు  రొమాన్స్ చేసుకున్నారు.

 

ఆ తర్వాత ప్రియుడు.. సౌరభ్ కాళ్లు చేతుల్ని తన రూమ్ కు తీసుకెళ్లి అక్కడ చేతబడి కూడా చేసినట్లు తెలుస్తొంది. మరల వీళ్లిద్దరు కలిసి ఒక డ్రమ్ ను కొనుగోలు చేసి.. దానిలో చెత్త, మట్టిని నింపి.. శరీరం భాగాలు దానిలో వేసి సిమెంట్ తో నింపేశారు. ఆ తర్వాత మనాలీకి పారిపోయారు. మనాలీలో  ఇద్దరు కూడా హోలీని చేసుకున్నారు. తాజగా.. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, భార్య కోసం ఉద్యోగం, కన్నవాళ్లను సైతం వదులుకుని వస్తే.. ఇలా ఘోరంగా విగత జీవిలా మారిపోయాడు.

Read more:  Karnataka Honey Trap: కర్ణాటకలో హనీట్రాప్ దుమారం.. బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి లాక్కెళ్లిన మార్షల్స్.. వీడియో వైరల్..

ఈ ఘటన ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. ముస్కాన్ ను అతని ప్రియుడ్ని బహిరంగంగా ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపున కోర్టు విచారణన నుంచి బైటకు రాగానే చాలా మంది వీరిపై కోర్టు బైట దాడులకు సైతం పాల్పడుతున్నారు. మొత్తంగా వీళ్లకు మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగంగా పనిష్మెంట్ వచ్చేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News