Honeymoon murder Case: ఫస్ట్ నైట్ అక్కడే అంటూ.. ప్లాన్ బీ రెడీగా పెట్టుకున్న తాటకీ..!.. హనీమూన్ మర్డర్ ఘటనలో చెమటలు పట్టించే నిజాలు..

Sonam Raghuvanshi murder case: తనకు ఈ పెళ్లంటే అస్సలు ఇష్టంలేదని ముందే ఇంట్లో వాళ్లతో సోనమ్ గొడవ పెట్టుకుందన్న ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి తర్వాత జరగబోయేదానికి మీరంతా బాధ్యత వహించాలని ముందే ఆమె తల్లితో గొడవ పెట్టుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 11, 2025, 06:41 PM IST
  • మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..
  • షాక్ అవుతున్న పోలీసులు..
Honeymoon murder Case: ఫస్ట్ నైట్ అక్కడే అంటూ.. ప్లాన్ బీ రెడీగా పెట్టుకున్న తాటకీ..!.. హనీమూన్ మర్డర్ ఘటనలో చెమటలు పట్టించే నిజాలు..

Meghalaya honeymoon case sonam raghuvarshi crime facts: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన కూడా మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం కొంత మంది మగాళ్లు.. అసలు పెళ్లి చేసుకొవాలంటేనే భయంగా ఉందని.. వచ్చే వాళ్లు ఇంత క్రిమినల్ మైండ్ సెట్ తో ఉంటే.. లైఫ్‌ ఇంకా ఎలా లీడ్ చేయాలని తెగ టెన్షన్ పడిపోతున్నారు.

Add Zee News as a Preferred Source

ఇటీవల యూపీలోని భర్తని ప్రియుడితో కలిసి మర్డర్ చేసి డ్రమ్ లో పెట్టిన ఘటన మరువక ముందే.. ప్రస్తుతం మేఘాలయ హనీమూన్ మర్డర్ ఘటన పెళ్లికానీ ప్రసాదుల్ని తెగ టెన్షన్ పెట్టిస్తుంది. ఈ నేపథ్యంలో సోనమ్ ఘటనలో మరిన్నిషాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోనమ్ కు అసలు.. ఈ పెళ్లి ఇష్టంలేదని, ఆమెకు రాజ్ కుశ్వాహాను ప్రేమిస్తున్నానని చెప్పింది.

కానీ ఇంట్లో వారు అంగీకరించకుండా ఈ పెళ్లిని సెట్ చేశారు. పెళ్లి తర్వాత అంతకుదురుకుంటుందని భావించారు. కానీ సీన్ మొత్తంగా రివర్స్ అయి వారి పీకలకు చుట్టుకుంది. పెళ్లికి ముందే తన భర్తను ఏంచేస్తానో మీరే చూడండని తల్లికి వార్నింగ్ ఇచ్చిందంట. అందుకే ముందస్తు ప్లాన్ ప్రకారం.. కనీసం ఫస్ట్ నైట్ కూడా జరక్కుండా.. మేఘాలయకు వెళ్లి అక్కడ ప్లాన్ చేద్దామని భర్తను టెప్ట్ చేసింది.  

అస్సాంకు వెళ్లి కామాఖ్య ఆలయంకు దర్శించుకునే వరకు ఫస్ట్ నైట్ వద్దని మొగుడ్ని భక్తి అనే సెంటి మెంట్ తో బకరా చేసింది. ఆ తర్వాత అనుకున్నట్లు గానే ప్లాన్ చేసి భర్తను ప్రియుడు, సుపారీ గ్యాంగ్ తో మట్టుపెట్టింది. అయితే.. సోనమ్ సోదరి మాత్రం.. రాజ్ కుశ్వాహ.. తన అక్కా అని పిలిచేవాడని.. పలు మార్లు రాఖీలు కూడా కట్టిందని చెప్పడం ఇంకా దరిద్రంగా చెప్పుకొవచ్చు.

Read more: Meghalaya Honey moon Murder: పెద్ద స్కెచ్ వేసి.. చిన్న లాజిక్ తో అడ్డంగా దొరికిపోయిన కిల్లర్ కిలేడీ సోనమ్ కపూర్.. షాకింగ్ నిజాలు ఇవే..

దీన్ని బట్టి చూస్తే ఆమెకు సమాజంలోని మానవత సంబంధాలు, విలువలు ఏమున్నాయో స్పష్టంగా అర్థమౌతుంది. మరోవైపు ఒక వేళ సుపారీ గ్యాంగ్ అటెంప్ట్ మిస్ అయితే.. కొండ మీద నుంచి తానే తోసేస్తానని కూడా సెకండ్ ప్లాన్ కూడా రెడీగా పెట్టుకుందన్న విషయం కూడా బైటపడింది. ఆమెను విచారిస్తున్న పోలీసులు కూడా ఆమె కన్నింగ్ ప్లాన్ లు విని షాక్‌ అవుతున్నారంట. ఈ ఘటనపై దేశమంత కూడా ఆమెకు బతికి ఉంచడం వెస్ట్ అని.. వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News