Meghalaya Honeymoon Murder Case: మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. భార్యే నిందితురాలు..!

Meghalaya Honeymoon Murder Case: కొత్తగా పెళ్లై హనీమూన్ ను వెళ్లిన అదృశ్యమైన కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో భార్య పక్కా స్కెచ్ ప్రకారం భర్తను చంపినట్టు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ తేల్చారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 9, 2025, 11:02 AM IST
Meghalaya Honeymoon Murder Case: మేఘాలయా హనీమూన్ మర్డర్  కేసులో వీడిన మిస్టరీ.. భార్యే నిందితురాలు..!

Meghalaya Honeymoon Murder Case: కొత్తగా వివాహామై ఎన్నో ఆశలో నూతన జీవితంలో అడుగుపెట్టిన భార్యాభర్తలు హనీమూన్ కోసం మేఘాలయా ట్రిప్ కు వెళ్లారు. ఈ ప్రేమ ప్రయాణంలో కొత్త దంపతులిద్దరు అదృశ్యమై పోయారు. దీంతో పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.అయితే.. తప్పిపోయిన జంటలో ముందుగా భర్త రాజా రఘువంశీ మృతదేహ: పోలీసులుకు లభ్యమైంది. ఇక ఎక్కడా కానరాకుండా పోయిన భార్య సోనమ్ ఆచూకి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టగా అందులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇష్టం లేని వివాహాం కారణంగా తన భర్తను చంపడానికి ముందుగానే సినీ ఫక్కీలో పథక రచన చేయడంతో పాటు ఎక్క్ క్యూట్ చేసింది. ఈ నేపథ్యంలో భర్తను చంపేందుకు కొంత మంది కాంట్రాక్ట్ కిల్లర్స్ కు సుపారీ ఇచ్చి మరి చంపినట్లు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ లో కనుక్కున్నారు. 

Add Zee News as a Preferred Source

ఇందుకోసం ముందు నుంచే పకడ్బందీ పథకం రెడీ చేసుకుంది. మేఘాలయా కు హనీమూన్ వెళ్లిన జంట కనిపించకుండా పోవడం.. కేవలం భర్త శవం మాత్రమే దొరకడం.. భార్య శవం కనిపించకోవడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ముఖ్యంగా పెళ్లైనప్పటి నుంచి సోనమ్ కాల్ డేటా తో పాటు హనీమూన్ వెళ్లినపుడు ఆమె ఎవరెవరికీ ఫోన్ చేసిందనే దానిపై పోలీసులు కూపీ లాగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె కాల్ డేటాతో పాటు ఆమె ఎవరెవరినీ కలిసిందనే దానిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ఆమెనే ఓ పథకం ప్రకారం తన భర్తను హత్య చేసినట్టు తేల్చారు. 

రాజా రఘువంశీ ఫ్యామిలీ నేపథ్య విషయానికొస్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండౌర్ లో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న ఈయనకు సోనమ్ తో పెళ్లి జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయాకు వెళ్లారు. ఆ తర్వాత మే 22న అక్కడ నుంచి ఓ టూ వీలర్ ను రెంట్ కు తీసుకొని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరకున్నారు. ఆ తర్వాత ఆ బండిని అక్కడ పార్కింగ్ చేసి అక్కడే ఉన్న ‘లివింగ్ రూట్ వంతెన’ ను చూసెందుకు వెళ్లారని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరు కనిపించుకుండా పోయారు. 

అయితే కనిపించకుండా పోయిన రఘువంశీ శవాన్ని 11 రోజుల తర్వాత సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని ఓ లోయలో పోలీసులు కనుక్కున్నారు. అయితే అతని బాడీపై కత్తిపోట్లు ఉండటంతో మర్డర్ గా భావించి పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఆ తర్వాత పోలీసులు అనుమానంతో సోనమ్ కాల్ డేటాను పరిశీలించి ఆమె హత్య చేయించిందనే నిర్ధారణకు వచ్చారు. అయితే.. సోనమ్ .. ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ లోని పోలీసులుకు ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసినట్టు మేఘాలయ డీజీపీ వెల్లడించారు. అంతేకాదు ఈ హత్యలో ఆమెకు దోహదపడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 

ఈ కేసులో రఘువంశీని చంపేందుకు అతని భార్య సోనమ్ .. కాంట్రాక్ట్ కిల్లర్స్ కు పెద్దమొత్తంలో నగదు ఇచ్చినట్టు పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందించారు. ఈకేసును తమ పోలీసులు వారం రోజుల్లో చేధించడంపై రాష్ట్ర పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కేసులో భార్య , ముగ్గురుతో పాటు మరికొంత మంది నిందితులు ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News