close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

రూ.10 లక్షలకే అమితాబ్ బచ్చన్ వాడిన బెంజ్ కారు

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చిందంటే కచ్చితంగా దాని ఖరీదు షోరూమ్ ఖరీదు కన్నా ఎక్కువే ఉంటుందని అనుకుంటారంతా. అందుకు కారణం గతంలో కొంతమంది సెలబ్రిటీలు వాడిన కొన్ని కార్లను వేలం వేయగా అసలు ఖరీదుకన్నా ఎక్కువ మొత్తమే పెట్టి మరీ కొన్న సందర్భాలుండటమే.

Updated: Jun 12, 2019, 06:35 PM IST
రూ.10 లక్షలకే అమితాబ్ బచ్చన్ వాడిన బెంజ్ కారు

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చిందంటే కచ్చితంగా దాని ఖరీదు షోరూమ్ ఖరీదు కన్నా ఎక్కువే ఉంటుందని అనుకుంటారంతా. అందుకు కారణం గతంలో కొంతమంది సెలబ్రిటీలు వాడిన కొన్ని కార్లను వేలం వేయగా అసలు ఖరీదుకన్నా ఎక్కువ మొత్తమే పెట్టి మరీ కొన్న సందర్భాలుండటమే. అయితే, ఈసారి సీన్ అందుకు రివర్స్ అయింది. బిగ్ బి అమితాబ్ వాడిన ఖరీదైన ఓ బెంజ్ కారు గతంలోనే మరొకరికి అమ్ముడుపోయింది. ఇప్పుడదే కారును మూడో యజమాని అమ్మానికి పెట్టాడు. అది కూడా ఎంతకో తెలుసా ? అక్షరాల రూ.9.99 లక్షలకే. అవును, గతంలో అమితాబ్ వాడిన మెర్సిడెస్-బెంజ్-ఎస్-క్లాస్ కారు ప్రస్తుతం రూ.9.99 లక్షలకే అమ్మకానికి ఉన్నట్టు కార్టాక్.కామ్ వెల్లడించింది. 

మార్కెట్‌లోకి ఏ కారు వచ్చినా వెంటనే ఆ కొత్త మోడల్ కారుని సొంతం చేసుకుని పాత కారును అమ్మేయడం అమితాబ్‌కి అలవాటు. ఆ అలవాటులో భాగంగానే అమ్ముడైన ఆ ఖరీదైన కారు ఇప్పుడిలా సాధారణ ధరకే అమ్మకానికి అందుబాటులో ఉంది. 2007 మోడల్‌, పెట్రోల్ వెర్షన్ బెంజ్ కారు రూ.10 లక్షలకే అమ్మకానికి ఉండటమే ఓ ఆసక్తికరమైన అంశమంటే, అది కూడా ఏకంగా అమితాబ్ వాడిన కారు కావడం ఈ కారు అమ్మకానికి మరింత ప్రచారం తెచ్చిపెట్టింది. 

ఇక అమితాబ్ వాడిన ఖరీదైన కార్ల జాబితా విషయానికొస్తే, లెక్సస్ ఎల్ఎక్స్ 570, మెర్సిడెస్-మెబాక్ ఎస్500, పోర్చ్ కేమన్, బెట్లె కాంటినెంటల్ జీటీ, మెర్సిడెస్-బెంజ్-V-క్లాస్, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వంటి కార్లు ఉన్నాయి. ఇవేకాకుండా ల్యాండ్ క్రూజర్, రోల్స్ రాయిస్ వంటి అత్యంత ఖరీదైన కార్లు సైతం అమితాబ్ ఉపయోగించిన కార్ల జాబితాలో ఉన్నాయి.