)
Meta apologizes for cm siddaramaiah over fault translation: కర్ణాటకలో అసలే సీఎం కుర్చి వివాదం తరచుగా వార్తలలో ఉంటునే ఉంటుంది. ఈ క్రమంలో పలుమార్లు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని డీకే శివకుమార్, సిద్దరామయ్య చెబుతున్న కూడా.. అంతర్గతంగా మాత్రం కుమ్ములాటలు ఉన్నాయని తరచుగా వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఏకంగా సీఎం సిద్దరామయ్య చనిపోయారని మెటా సంస్థ చేసిన తప్పుడు అనువాదంపై.. కర్ణాటక ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. దీనిపై ప్రస్తుతం కన్నడ రాజకీయాల్లో హట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.
దిగ్గజ నటి సరోజా దేవి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె అకాల మరణానికి సంతాపం తెలుపుతూ సీఎం సిద్దరామయ్య తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ పెట్టారు. దీన్ని మెటా సంస్థ ఆంగ్లంలో కన్నడ నటికి బదులు.. సీఎం సిద్దరామయ్యలేరని అర్థం వచ్చేలా తప్పుగా అనువాదం చేసింది. దీంతో ఇది వెంటనే వైరల్‌గా మారింది. దీనిపై సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. మెటాను సున్నితంగా హెచ్చరిస్తు.. ఇక మీదట కన్నడ భాషను ఆంగ్లంలో అనువాదం చేయడం మానివేయాలన్నారు.
ఈ ఫీచర్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కన్నడ నాట సిద్దరామయ్య అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ క్రమంలోనే.. తాజాగా దీనిపై మెటా సంస్థ దిగొచ్చింది. తమ మెటా టూల్ చేసిన తప్పిదానికి ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పింది.
కన్నడ అనువాదం సరిగ్గా లేదనే సమస్యను పరిష్కరించామని మెటా ప్రతినిధి తెలిపారు. అంతేకాకుండా జరిగిన తప్పిదానికి చింతిస్తున్నట్లు కూడా చెప్పారు. అనువాదంలో ఏఐ టూల్ మిషన్ తప్పిదం వల్లే ఇదంతా జరిగిందని.. ఖచ్చితమైన అనువాదాన్ని అందించడంతో పాటు, ఇక మీదట ఎలాంటి పొరపాట్లు జరక్కుండా చూసుకుంటామని మెటా ప్రతినిధులు చెప్పడంతో ఈ వివాదంకు ఫుల్ స్టాప్ పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.