)
Millionaires Migration: ప్రపంచంలోనే కాదు ఇండియాలో కూడా గత కొద్దికాలంగా మిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. అదే క్రమంలో సొంత దేశాల్ని వదిలిపోతున్నారు. ఇండియాలో గత పదేళ్లలో పెద్ద సంఖ్యలో కుబేరులు దేశం వదిలి వెళ్లిపోవడం ఆందోళన కల్గిస్తోంది.
ఇండియాలో 2014 నుంచి 2024 మధ్యకాలంలో 72 శాతం మంది మిలియనీర్లుగా మారారు. ఇండియాలోనే పుట్టి ఇక్కడే పెరగడం, చదవడం, ఉద్యోగ వ్యాపారాలతో కోట్లు సంపాదించుకున్న ధనికులు చివర్లో దేశం వదిలి పోతున్నారు. హాయిగా విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2014 నుంచి 2024 వరకు ఇండియాలో 72 శాతం మంది మిలియనీర్లు అయినట్టు హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ తెలిపింది. అదే సమయంలో వీరిలో విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత మూడేళ్లలో మాత్రం ఈ సంఖ్య కొద్దిగా తగ్గింది.
హెన్లీ అండ్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం 2025లో అంటే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశాన్ని వదిలి వెళ్లిన మిలియనీర్ల సంఖ్య 3500 కాగా 2024లో 4300గా ఉంది. అంతకంటే ముందు 2023లో 5100 మంది కుబేరులు దేశం వదిలి వెళ్లిపోయారు. వివిధ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా వలస కుబేరుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది.
ఈ నివేదిక ప్రకారం వలస సంపద 26.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో 1.42 లక్షల మంది కుబేరులు సొంత దేశాలు వదిలి వెళ్లిపోయారు. వీరిలో అత్యధికంగా యూఏఈ, అమెరికాలను ఎంచుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook