Delimitation Row: త్వరలోనే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు పెరుగనున్న నేపథ్యంలో ఈ వివాదం ఉత్తర, దక్షిణ భారతదేశంగా రెండుగా విడిపోయింది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోన వ్యక్తం చేసినట్టుగానే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని చేస్తున్న వాదనకు స్టాలిన్ తోడయ్యారు. కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సీఎం స్టాలిన్ తాజాగా ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారంతా వెంటనే పిల్లలను కనేయాలని సూచించారు. ఈ సూచన రాజకీయంగా సంచలనం రేపుతోంది.
Also Read: MLC Elections: రేవంత్ రెడ్డికి సీపీఐ ఝలక్.. 'రెండూ' ఇచ్చేయాలని ఆల్టిమేటం
తమిళనాడులోని నాగపట్నంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది ప్రాంతానికి తీవ్ర అన్యాయం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎంకే స్టాలిన్ తాజాగా అదే విషయమై తాజాగా మరోసారి స్పందించిన స్టాలిన్ 'నియోజకవర్గాల పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలి' అని పిలుపునిచ్చారు.
Also Read: Dasoju Sravan Kumar: ఈసారైనా దాసోజు శ్రవణ్‌కు 'ఎమ్మెల్సీ' దాసోహమవుతుందా?
కొత్త జంట పిల్లల విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో తానే చెప్పినట్లు సీఎం స్టాలిన్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయిని.. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్న వేళ గతంలో మాదిరి చెప్పలేనని పేర్కొన్నారు. 'గతంలో కుటుంబ నియంత్రణపై దృష్టిసారించాం. కానీ ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లోకి వచ్చాం. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనాలి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టాలి' అని సూచించారు.
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఉండడంతో తమిళాడు పూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జనాభా ఆధారంగా జరిగితే తమిళనాడుకు 8 నియోజకవర్గాల వరకు తగ్గుతాయని సీం స్టాలిన్ ఆందోళనకు ప్రధాన కారణం. ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 5వ తేదీన సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాష్ట్రంలోని 40కు పైగా పార్టీలను ఆహ్వానించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన పనులు 2026లో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









