close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

మోడీ కేబినెట్ కీలక నిర్ణయం: ఇక నుంచి ఈ-సిగరెట్లు నిషేదం

పొగాకు ఉత్పత్తులకు సంబంధించి మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated: Sep 18, 2019, 04:23 PM IST
మోడీ కేబినెట్ కీలక నిర్ణయం: ఇక నుంచి ఈ-సిగరెట్లు నిషేదం

ఢిల్లీ: క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రధాన కారణంగా నిలిచే పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ-సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వపై నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.  ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.

మంత్రివర్గ భేటీ అనంతరం  ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేబినెట్ నిర్ణయాన్ని  మీడియాకు తెలిపారు.  ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ  ఈ-సిగరెట్లపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ఈ రోజు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 

ఇక నుంచి దేశంలో ఎక్కడా  ఈ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతి-ఎగుమతి, రవాణా, అమ్మకం, నిల్వ చేయడం జరిగితే వాటిని నేరంగా పరిగణిస్తామన్నారు. అలాగే ఈ -సిగరేట్లకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నామని అని సీతారామన్ తెలిపారు.