National Old Age Pension Scheme: సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా పెన్షన్.. సింపుల్‌గా ఇలా దరఖాస్తు చేసుకోండి

Old Pension Scheme: సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా పెన్షన్ అందించేందుకు కేంద్రం జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఎవరు అర్హులు..? నెలకు ఎంత పెన్షన్ వస్తుంది..? పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : May 1, 2025, 08:22 PM IST
National Old Age Pension Scheme: సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా పెన్షన్.. సింపుల్‌గా ఇలా దరఖాస్తు చేసుకోండి

Old Pension Scheme: వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్లు తమ జీవితాలను ప్రశాంతంగా గడపడానికి వారికి ప్రతి నెలా నిర్ణీత మొత్తం అందించే ఉద్దేశంతో వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ కోసం ప్రభుత్వం ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మీ ఫ్యామిలీలో వృద్ధులు ఉండి.. ఆదాయ వనరులు లేకపోతే ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని 1995లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP)లో భాగంగా ప్రారంభించింది. ఆ తరువాత ఈ స్కీమ్‌ పేరును ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకంగా మార్చారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అర్హులైన వారందరినీ అంటే బీపీఎల్‌ను కూడా చేర్చడానికి ఈ స్కీమ్‌లో నిబంధనలు మార్చారు. 

Add Zee News as a Preferred Source

జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్‌ కింద పింఛన్‌ను కొంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం, కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది. కాబట్టి ఈ పెన్షన్ అమౌంట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సీనియర్ సిటిజన్లు వృద్ధాప్య పింఛన్ పెన్షన్‌గా నెలకు రూ.వెయి కంటే ఎక్కువ అందుకుంటున్నారు. హిమాచల్‌లో రూ.550, రాజస్థాన్‌లో రూ.500, మహారాష్ట్రలో రూ.600, బీహార్‌లో రూ.400, యూపీలో రూ.300 పెన్షన్ అందజేస్తున్నారు.

ఈ స్కీమ్‌కు 60 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు అర్హులు. పెన్షన్ మొత్తంలో రూ.200 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్‌ కింత నెలకు రూ.500 అందజేస్తోంది.

ఎవరు అర్హులు..?

==> 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి అర్హులు. గతంలో వయోపరిమితి 65 సంవత్సరాలుగా ఉండగా.. 60 ఏళ్లకు తగ్గించారు.
==> దారిద్య్రరేఖకు (BPL) దిగువన నివసిస్తున్న కుటుంబానికి చెందినవారై ఉండాలి.
==> లబ్ధిదారుడి కుటుంబంలో 20 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కుమారుడు లేదా మనవడు ఉండి.. అతను కూడా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తుంటే ఈ స్కీమ్‌కు అర్హులు అవుతారు. 
==> 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు దారిద్య్రరేఖకు దిగువన లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అర్హులు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

==> జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్‌కు అర్హత ఉన్నవారు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.
==> ఏప్రిల్ 1, 2016 నుంచి దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో కూడా జరుగుతోంది. 
==> ప్రతి జిల్లాలోని బ్లాక్ స్థాయిలో ఉన్న RTPS కార్యాలయంలో కూడా జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: NEET UG 2025: నీట్ యూజీ పరీక్షలో మల్టీ లెవెల్ చెకింగ్, తేడా జరిగితే అంతే సంగతులు

Also Read: RBI Big Update: దేశంలో 500 నోటు రద్దు కానుందా, ఆర్బీఐ ఆదేశాలకు అర్ధం అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News