Gang Rape News: ఘోరం.. ఐదేళ్ల చిన్నారిని హత్య చేసి.. తల్లిపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు..!

Haryana crime news: హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జింద్ ప్రాంతంలో ఉంటున్న ఒక మహిళ నివాసంలోకి రాత్రిపూట నీచులు ప్రవేశించి  సాముహిక అత్యాచారంకు పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 26, 2025, 01:41 PM IST
  • మహిళపై గ్యాంగ్ రేప్..
  • సీరియస్ అయిన పోలీసులు..
Gang Rape News: ఘోరం.. ఐదేళ్ల చిన్నారిని హత్య చేసి.. తల్లిపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఇద్దరు  మైనర్లు..!

Mother gang raped and 5 years daughter murdered in Haryana: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారడంలేదు. ఆడది కన్పిస్తే చాలు.. పశువుల్లా మారిపోతున్నారు. ఈ దుర్మార్గుల బారి నుంచి మహిళలు, యువతులను కాపాడటం కోసం పోలీసులు నిరంతరం గస్తీనీ కాస్తున్నారు. అయినకూడా ఈ ఘోరాలు మాత్రం ఆగడంలేదు.

Add Zee News as a Preferred Source

గుడి, బడి, మెట్రోలు, బస్టాండ్ లు, పనిప్రదేశాలు , చివరకు పోలీస్ స్టేషన్లో కూడా మహిళలకు వేదింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలో హర్యానాలో జింద్ గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది . ఈ  ఘటన ఏప్రిల్ 22న చోటు చేసుకుంది. జింద్ ప్రాంతంలో మహిళ తన భర్త ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో ఉంటుంది.

అయితే.. ఇటీవల మహిళ భర్తకు, మరో వ్యక్తికి గొడవలు జరిగాయి. దీంతో అతను వీళ్ల మీద పగ పెంచుకున్నాడు. అదును కోసం చూశాడు. ఇటీవల ఆమె భర్త ఇంట్లో లేడని తెలుసుకుని... రాత్రిపూట గుడిసెలో ప్రవేశించి మహిళపై నలుగురు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అంతేకాకుండా.. మహిళ పక్కనే ఉన్న ఐదేళ్ల చిన్నారిని కూడా పక్కకు తీసుకెళ్లి గొంతు నులిమి మరీ చంపేశారు. మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.

Read more: Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?

మరుసటి రోజు అక్కడున్న వారు గమనించారు. మహిళ .. తన కూతురును బహిర్బూమికి తీసుకెళ్లి అక్కడ తన కూతురి శవాన్ని పాతిపెట్టింది. అంతే కాకుండా.. ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మహిళను ఆస్పత్రికి టెస్టుల కోసం తరలించారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడు  అమిత్ ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెల్చారు.ఈఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News