Mudra Loan Scheme Explained: ఎలాంటి హామీ లేకుండా ఏ బ్యాంకులో రుణం లభించదు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం లేని వారి కోసం రూ.10 లక్షల రుణాన్ని అందిస్తోంది. ఈ రుణం సులభంగా ఎలాంటి హామీ లేకుండా పొందే అవకాశం దొరుకుతుంది. పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2015లో ముద్ర లోన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సొంతంగా బిజినెస్ లేదా స్టార్టప్ కంపెనీలు ప్రారంభించడానికి దోహదం చేస్తుంది. ఇది గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల వారు కూడా వర్తిస్తుంది. ఎలాంటి హామీ లేకుండా ఈ పథకంలో రుణాన్ని అందిస్తారు. మీరు సరైన బిజినెస్ ప్లాన్ తో వస్తే ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులు అవుతారు. బ్యాంకుల ద్వారా ఈ పథకంలో రుణం మంజూరు అవుతుంది. ముద్ర లోన్ స్కీమ్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రధానంగా రూ.50 వేల నుంచి ఈ పథకం రుణం అందుబాటులో ఉంది. మొదటగా రూ.50వేల నుంచి ఐదు లక్షలు. ఆ తర్వాత రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముద్ర లోన్ పథకం కింద రుణాన్ని మంజూరు చేస్తారు. ఆయా బిజినెస్ ల ఆధారంగా రుణాల్ని మంజూరు చేస్తాయి బ్యాంకులు.
చిన్న కంపెనీలు, సర్వీసులు సెక్టార్, కిరాణా షాపులు, కూరగాయలు, పండ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ ముద్ర పథకం ద్వారా రుణాన్ని మంజూరు చేస్తారు. గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం ఈ రెండు ప్రాంతాల్లో ఈ పథకాన్ని అందిస్తోంది.
ముద్ర లోన్‌కు అర్హులు..
ముద్ర లోన్‌కు అర్హత సాధించాలంటే భారతీయ పౌరులై ఉండాలి. ఇదివరకు ఎలాంటి రుణాల ఎగవేత చేసి ఉండకూడదు. కనీసం మూడేళ్ల పాటు ఏదైనా బిజినెస్ చేసి ఉన్న అనుభవం కలిగి ఉండాలి. వారి వయస్సు 24 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
ముద్ర లోన్‌కు అప్లై చేసే విధానం..
ముద్ర లోన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే www.udayamimitra.in అధికారిక వెబ్‌సైట్‌లో 'Apply Now' ఆప్షన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త బిజినెస్ అయిన ప్రస్తుతం ఏదైనా వ్యాపారం చేస్తున్న సొంతంగా బిజినెస్ ప్రారంభించాలి అనుకున్న ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ లో మీ పేరు ఇమెయిల్ నెంబర్, మొబైల్ నెంబర్ ,రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఓటీపీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ ప్లాన్స్ సరైనదే అయితే వెరిఫై చేసి మీకు రుణాన్ని మంజూరు చేస్తారు. ఎలాంటి హామీ లేకుండా సులభంగా ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చు.
Also Read: ఏ హామీ లేకుండా రుణం కావాలా? కేవలం ఆధార్‌తోనే 5 సూపర్ ప్రయోజనాలు!
Also Read: అటల్ పెన్షన్ రూ.5000 స్కీమ్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









