Nagpur girl critically injured zipline accident video: సాధారణంగా చాలా మంది వరుసగా సెలవులు, వీకెండ్స్ వచ్చాయంటే తమ వాళ్లతో , ఫ్రెండ్స్ తో కలిసి సరదగా కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. పిక్నిక్ లు, జలపాతాలు, ఎత్తైన కొండలు మొదలైన ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొన్ని సార్లు ఈ సరదా ప్రయాణాల్లో అనుకొని ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో విహారయాత్రలు కాస్త .. విషాదంగా కూడా మారిన ఘటనలు కొకొల్లలు.
తాజాగా.. నాగ్ పూర్ కు చెందిన ఒక కుటుంబం హిమచల్ ప్రదేశ్ లోని మానాలీకి వెళ్లారు. అక్కడ పదేళ్ల బాలిక త్రిశ.. సోలాంగ్ వ్యాలీ వద్ద జిప్ లైనింగ్ ఎక్కేందుకు ఆసక్తి చూపించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు జిప్ ఆపరేటర్లతో మాట్లాడి..ఆమెను జిప్ లైనింగ్ ఎక్కించారు. ఈ క్రమంలో ఆమె ఒక చోట నుంచి మరోక చోటుకు రోప్ వేలాంటి వంతెన మీద గాల్లో వెళ్తుంది.
🚨safety cable breaks and a girl doing #Zipline falls from 30 feet and gets seriously injured in #Manali.
Adventure sports in India has always a been Unregulated & Unsafe ‼️
P.S : I don’t understand the whole point of risking own life doing these adventure sports like… pic.twitter.com/QlLZnxCU4O
— Amitabh Chaudhary (@MithilaWaala) June 15, 2025
తొలుత యువతి కేరింతలు కొడుతు ఎంజాయ్ చేసింది. కానీ మధ్యలో వెళ్లగానే.. ఒక్కసారిగా రోప్ వే తెగిపోయింది. యువతి 30 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆమె తల్లిదండ్రులు, జిప్ లైనింగ్ నిర్వాహకులు షాక్ అయ్యారు. వెంటనే యువతిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రాళ్లమీద అత్యంత ఎత్తులో నుంచి పడటంతో ఆమెకు బలమైన గాయాలయ్యాయి.
Read more: Vijay Rupani: విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు.. అంత్యక్రియలు ఎక్కడంటే..?
ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు జిప్ లైనింగ్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. సరైన సెఫ్టీ విధానాలు పాటించకుండానే.. జిల్ లైనింగ్ ను ఏర్పాటుచేసినందుకు టూరిస్టులు వారిపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.