Tamilnadu BJP: తమిళనాడు రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీతో కూటమిగా బరిలో దిగాలని భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ గ్రాఫ్ ను పెంచిన అన్నామలై ప్లేస్ లో కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ను ఎన్నుకోబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో అన్నామలై ప్రచార బాధ్యతలతో పాటు కూటమి అధికారంలోకి వస్తే కీలక పదవి కట్టబెట్టే ఉద్దేశ్యంతో ఆయనతో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది.
మరోవైపు తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. దీంతో ఆయన నియామకం ఖాయమైంది. నాగేంద్రన్ పేరును అన్నామలై ప్రతిపాదించగా, పార్టీ ఇతర నేతలు బలపరిచారు. బీజేపీ 13వ అధ్యక్షుడిగా ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
నైనార్ నాగేంద్రన్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. జయలలిత హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే ఆమె మరణానంతరం, 2017లో ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో సుదీర్ఘంగా పనిచేస్తూ వచ్చారు.
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలో భాగంగా తిరునల్వేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అన్నాడీఎంకేతో నాగేంద్రన్‌కు ఉన్న మంచి సంబంధాల కారణంగా, ఈ కూటమి మరింత బలపడుతుందన్న నమ్మకంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా.
ఈ రకంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ముందు నుంచి పార్టీలో లేని వాళ్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. రీసెంట్ గా కేరళలో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని రాజీవ్ చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించింది. గతంలో అస్సాం కాంగ్రెస్ నేతగా ఉన్న హిమంత్ బిశ్వ శర్మను ఏకంగా ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. అటు కర్ణాటకలో కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన బసవరాజ బొమ్మైను ముఖ్యమంత్రిని చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆర్ఎస్ఎస్ నేపథ్యంలేని నేతను బీజేపీ అధ్యక్షుడిగా నియమించినా.. పెద్దగా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఈటలకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఖాయం అనే ముచ్చట వినిపిస్తోంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









