Narendra Modi: 'అడవులపై బుల్డోజర్లను పంపి బీభత్సం'.. హెచ్‌సీయూ భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Narendra Modi Reaction On HCU Lands: దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరిగిన హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి నరేంద్ర మోదీ స్పందించారు. హెచ్‌సీయూ భూములపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 14, 2025, 05:29 PM IST
Narendra Modi: 'అడవులపై బుల్డోజర్లను పంపి బీభత్సం'.. హెచ్‌సీయూ భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Modi On HCU Lands: 'తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయింది. అడవులను నరికి పర్యావరణాన్ని.. వన్యప్రాణులను నాశనం చేస్తుంది' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లను పంపుతుంది.. ఇది కాంగ్రెస్ మోడల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీజేపీ మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది' అని మండిపడ్డారు.

Add Zee News as a Preferred Source

Also Read: MP Bandi Sanjay: చంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది.. బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్

హర్యానాలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన.. రేవంత్‌ రెడ్డి వైఫల్యాలు.. హెచ్‌సీయూ భూముల వివాదంపై స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కంచె గచ్చిబౌలి పర్యావరణ విధ్వంసంపై ప్రధాని మోదీ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయింది. అడవులను నరికి పర్యావరణాన్ని, వన్యప్రాణులను నాశనం చేస్తుంది' అని వివరించారు.

Also Read: Jana Reddy: జానారెడ్డి ధృతరాష్ట్రుడు.. ఆయనో దుర్మార్గుడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

'అడవులపై బుల్డోజర్లను పంపుతుంది. ఇది కాంగ్రెస్ మోడల్' అని హర్యానా సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఈ సభ వేదికగా కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ప్రకృతి, జంతువులకు నష్టం జరిగితే ప్రమాదం. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో  ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతుంది' అని మోదీ విమర్శించారు.

కాంగ్రెస్‌ పాలిత హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలపై మోదీ విమర్శలు చేశారు. 'హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు ఆందోళనలో అభివృద్ధి కుంటుపడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు.. బస్సు కిరాయి వరకు అన్ని ధరలు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ధరలు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది' అని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. సత్యం ఆధారంగా.. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. వికసిత భారత్ కోసం తాము పని చేస్తున్నట్లు ప్రకటించారు.

మోదీ విమర్శలపై ఎంపీ చామల స్పందించారు. 'హెచ్‌సీయూపై జరుగుతున్న అవాస్తవ ప్రచారం గురించి ప్రధాని మోదీకి తెలియనట్లు ఉంది. కంచె గచ్చిబౌలి భూమి వివాదం సుప్రీంకోర్టులో ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ సర్కార్‌పై మాట్లాడుతున్నారు' అని ప్రధానిపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఏఐ మార్ఫింగ్ ఫొటోలకు మోడీ కూడా నమ్మినట్లు ఉన్నారని.. అందుకే విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News