JEE Main 2025 Session 2: జేఈఏ మెయిన్స్, అడ్వాన్స్‌తో పాటు నీట్ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 2 నుంచి 9 వరకూ వివిధ దశల్లో వేర్వేరు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే జనవరిలో తొలి విడత పరీక్షలు పూర్తి కాగా ఏప్రిల్ నెలలో మలి విడత నిర్వహించేందుకు ఎన్టీఏ సిద్ధమైంది.
ప్రతి ఏటా జేఈఈ మెయిన్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంటుంది. మొదటి సెషన్ సరిగ్గా రాయలేనివారి కోసం లేదా మంచి స్కోర్ కోసం రెండవ అవకాశం కల్పించేందుకు ఇలా రెండుసార్లు నిర్వహిస్తుంది. ఇందులో అర్హత సాధిస్తేనే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు వీలుంటుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి ఈ పరీక్ష తప్పనిసరి. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఇప్పటికే జనవరి 22 నుంచి 29 వరకూ 8 రోజుల పాటు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు సెషన్ 2 పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 2 నుంచి 7వ తేదీ వరకు తిరిగి ఏప్రిల్ 9న ఈ పరీక్షలు జరగనున్నాయి.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 షెడ్యూల్
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2, 3,4,7 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు మొదటి దశ కాగా, మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండవ దశ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 8న మొదటి షిఫ్టు మాత్రమే ఉంటుంది. ఇక ఏప్రిల్ 9వ తేదీన పేపర్ 2ఎ బీఆర్క్ కేటగరీ, పేపర్ 2బి బి ప్లానింగ్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న నగరాలతో పాటు విదేశాల్లో కూడా 15 నగరాల్లో జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. త్వరలో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. ఏపీ,తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇంటర్ పరీక్షలు మరో నాలుగైదు రోజుల్లో ముగియనుండటంతో ఇక విద్యార్ధులు జేఈఈ మెయిన్ సెషన్ 2 లేదా మే 4న జరిగే నీట్ పరీక్షలపై దృష్టి సారించనున్నారు.
Also read: Rains in Summer: మండు వేసవిలో భారీ వర్షాలు, మరో రెండ్రోజులు కూడా, ఎక్కడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి