Navy Officer Couple Dance Video: పెళ్లి తర్వాత భార్యతో ఆర్మీ అధికారి డ్యాన్సులు.. ఎంత చక్కగా చేశారో..?.. వీడియో వైరల్..

Pahalgam Terror Attack: పహాల్గంలో ఇటీవల ఉగ్రమూకలు టూరిస్టులపై కాల్పులతో తెగబడ్డాయి.ఈ ఘటనలో హర్యానాకు చెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ చనిపోయిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో.. కొత్త జంట పహాల్గంలో డ్యాన్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 24, 2025, 01:29 PM IST
  • పహల్గంకు ముందు డ్యాన్స్ లు చేసిన నేవీ అధికారి కపుల్..
  • ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు..
Navy Officer Couple Dance Video: పెళ్లి తర్వాత భార్యతో ఆర్మీ అధికారి డ్యాన్సులు.. ఎంత చక్కగా చేశారో..?.. వీడియో వైరల్..

Navy Officer Vinay narwal couple dance video: పహాల్గంలో ఇటీవల ఉగ్రమూకలు పేట్రేగిపోయాయి. అమాయకులైన టూరిస్టులపై కాల్పులతో తెగబడ్డాయి. అప్పటి వరకు తమ వాళ్లతో ఫోటోలు దిగుతూ, అక్కడి వాతావరణంను ఎంజాయ్ చేస్తున్న వారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా బుల్లెట్ల శబ్దంతో, రక్తపాతంతో దద్దరిల్లింది.అప్పటి వరకు తమతోఉన్న వారు ఉగ్రమూకల కాల్పులకు బలయ్యారు.

Add Zee News as a Preferred Source

ఈ ఘటనలో 26 మంది ప్రాణాలుకోల్పోయారు. అయితే.. హర్యానాకు చెందిన ఆర్మీఅధికారి వినయ్ నర్వాల్, హిమాన్షి కొత్త జంట ఘటన మాత్రం అందర్ని కలిచివేస్తుంది. ఏప్రిల్ 16న వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత 19న విందు జరిగింది. సరదగా హనీమూన్ కోసం గడుపుదామని కశ్మీర్ కు వచ్చారు. కానీ ఇంతలోనే.. తన కళ్ల ముందే భర్తను పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్చారని నవవధువు గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టుకుంది.  

 

సైనిక దుస్తులతో వచ్చిన ముష్కరులు.. హిందువులా, ముస్లింలా అని తెలుసుకుని మరీ కాల్పులకు తెగబడ్డారు.ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ఆర్మీ అధికారి వినయ్ నర్వాల్ ఈ ఘటనకు ముందు తన భార్యతో కలిసి డ్యాన్స్ లు చేసిన చివరి వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈజంట పచ్చని వాతావణంలో, ఎంతో అందంగా ఉన్న నేచర్ లో.. డ్యాన్స్ లు చేస్తు.. ఒకరిపై మరోకరు తమకున్న ప్రేమను చాటుకున్నారు.

మొత్తంగా ఈ జంటను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని నెటిజన్లు అంటున్నారు. కానీ.. ఆ ఉగ్రనీచులు వీళ్లను విడగొట్టారిని వాళ్లపై శాపనార్థాలు పెడుతున్నారు. ప్రస్తుతం ఆర్మీ అధికారి వినయ నర్వాల్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

Read more: Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న నవవధువు కన్నీటి వీడ్కోలు.. వీడియో వైరల్..

అంత్యక్రియల సమయంలో కూడా.. ఆయన సతీమణిని గుండెలవిసేలా తన భర్తను తలచుకుంది కన్నీళ్లుపెట్టుకుంది. ఈ ఘటనను చూసిన యావత్ భారతా వనీ కూడా ఒకవైపు నవవధువుకు తమ సంతాపం తెలియజేస్తు... అదే విధంగా ఉగ్రవాదులకు దీనికి రెట్టింపు బాధకల్గేలా కేంద్రం చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News