Chhattisgarh Blast: మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగారు. ఛత్తీస్‌ఘఢ్ సుక్మా జిల్లాలో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. ఈ ఘటలో ఏఎస్పీ ఆకాశ్రారావు అక్కడికక్కడే మరణించారు. డీఎస్పీ, సీఐ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2 నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు మావోల స్థావరాలను ధ్వంసం చేస్తోంది. టాప్ కమాండర్ మావోలు కాల్పుల్లో ఇప్పటికే మరణించారు. జూన్ 10న సీపీఐ (మావోయిస్ట్) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన దృష్ట్యా.. ఎలాంటి నక్సలైట్ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. సుక్మా జిల్లాలో నక్సలైట్లు ఐఈడీ పేల్చారని.. ఫుట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న అనేక మంది పోలీసులు గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. నక్సల్ ఆపరేషన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ చోటుచేసుకుంది. కుంట సమీపంలోని డొండ్రా అటవీ ప్రాంతంలో ప్రెజర్ బాంబ్ పేలింది.
సమాచారం అందుకున్న అదనపు బలగాలు.. ఘటనా స్థలానికి చేరుకుని మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 10వ తేదీన మావోల బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిక్వార్ గూడ వద్ద ఆదివారం ఓ పొక్లెయిన్‌ను మవోయిస్టులు దహనం చేశారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ ఆకాశ్ రావ్, సిబ్బందితో ఆ ప్రదేశానికి వెళ్లేందుకు కాంటా-ఎరబోరా మార్గంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మావోలు ప్రెజర్ ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో ఏఎస్పీ మరణించగా.. మిగిలిన సిబ్బంది గాయపడ్డారు. ఆకాశ్ రావ్ మృతిపై ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.









