ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మరణాన్ని హత్య కేసుగా నమోదు !!

దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ మరణాన్ని హత్య కేసుగా నమోదు చేశారు. మూడు రోజుల క్రితం  ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కారిన స్థితిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం  అనుమానస్పద స్థితిలో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి పోస్టు మార్టంకు తరలించారు. ఈ రిపోర్టులో ఇది సహజమరణం కాదని తేలింది. దిండుతో నొక్కిపెట్టి ఊపిరి ఆడకుండా చేయడం వల్లనే రోహిత్ శేఖర్ ప్రాణాలు విడిచినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ మరణాన్ని హత్య కేసుగా నమోదు చేసి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు. 

కేసు విచారణలో భాగంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇవాళ హత్య జరిగిన స్పాట్.. రోహిత్ శేఖర్ నివాసానికి  వెళ్లి పరిశీలించారు. రోహిత్ నివాసంలో మొత్తం 7 సీసీటీవీ కెమెరాలు ఉండగా అందులో ప్రస్తుతం  2 కెమెరాలు పనిచేయలేదని తెలుస్తోంది. పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.

విచారణలో భాగంగా ..రోహిత్ కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లో పనివాళ్లను పోలీసులు ప్రశ్నించారు. రోహిత్ శేఖర్ సుదీర్ఘకాలం న్యాయపోరాటం తర్వాత తాను ఎన్డీ తివారీ కుమారుడ్నని అధికారంగా నిరూపించుకున్న సంగతి తెలిసిందే . ఎన్టీ తివారీ మరణించిన ఏడాది లోపు ఈ ఘటన జరగడం గమనార్హం.

English Title: 
ND Tiwari's son Rohit Shekhar's postmortem report reveals 'unnatural death', murder case filed
News Source: 
Home Title: 

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మరణాన్ని హత్య కేసుగా నమోదు !!

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మరణాన్ని హత్య కేసుగా నమోదు !!
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మరణాన్ని హత్య కేసుగా నమోదు !!
Publish Later: 
No
Publish At: 
Friday, April 19, 2019 - 18:57