NEET PG 2025 Exam Dates: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల తేదీను ప్రకటించింది. నీట్ పీజీ 2025 పరీక్ష రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. జూన్ 15న నీట్ పీజీ 2025 పరీక్ష నిర్వహిస్తారు.
నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ, టైమింగ్స్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 15వ తేదీన రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలనే నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. దీనిపై ఎక్స్ వేదికగా మేధావులు, వైద్యులు, అభ్యర్ధులు కామెంట్లు చేస్తున్నారు. నీట్ పీజీ పరీక్షను రెండు దశల్లో నిర్వహించాలని చూడటం ఎంతవరకు సరైందని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల అన్‌ఫెయిర్ స్కోరింగ్, న్యాయపరమైన వివాదాలు, అభ్యర్ధుల్లో ఒత్తిడి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదే తప్పుల్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారని ప్రశ్నించారు. సింగిల్ షిఫ్ట్‌లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కూడా యునైటెడ్ డాక్టర్స్ ఫోరమ్ లేఖ రాసింది.
నీట్ పీజీ 2025 పరీక్ష ప్రక్రియలో ముఖ్యమైన తేదీలు
నీట్ పీజీ 2025 పరీక్ష 2025 జూన్ 15
ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అప్లికేషన్ దాఖలుకు చివరి తేదీ మే మూడవ వారం
నీట్ పీజీ అడ్మిట్ కార్డ్ జూన్ 2వ వారంలో విడుదల
పరీక్ష విధానం-ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష
రెండు షిఫ్టుల్లో పరీక్ష
నీట్ పీజీ 2025 పరీక్షకు హాజరయ్యే జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు 3500 రూపాయలు ఫీజు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులయితే 2500 రూపాయలు చెల్లించాలి.
Also read: Best match Finishers: ఈసారి ఐపీఎల్ 2025లో బెస్ట్ మ్యాచ్ ఫినిషర్లు ఏయే జట్ల నుంచి ఎవరున్నారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









