NEET PG 2025 Application Date: దేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఇప్పుడు నీట్ పీజీ 2025 పరీక్షను ఆన్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహించనుంది. ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఎప్పుడు అనే వివరాలు తెలుసుకుందాం.
ఇవాళ అంటే ఏప్రిల్ 17 మద్యాహ్నం 3 గంటలకు నీట్ పీజీ 2025 నోటిఫికేషన్ వెలువడనుంది. మే 7వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు విండో ఓపెన్ ఉంటుంది. అప్పటి వరకూ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ దాఖలు చేయవచ్చు. నీట్ పీజీ 2025 పరీక్ష జూన్ 15న ఉంటుంది. జూలై 15వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. నీట్ పీజీ పరీక్షను ఈసారి రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనుండటంపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించడంపై మెడిసిన్ విద్యార్ధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించాలని కోరారు. రెండు దశల్లో పరీక్ష నిర్వహించడం వల్ల ప్రశ్నాపత్రం సరిగ్గా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా సరే ఈ అభ్యంతరాల్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ పట్టించుకోలేదు. దేశవ్యాప్తంగా ఉన్న 52 వేల పీజీ సీట్ల కోసం ప్రతి ఏటా 2 లక్షల మంది ఎంబీబీఎస్ అభ్యర్ధులు నీట్ పీజీ పరీక్ష రాస్తుంటారు.
నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో గత ఏడాది తొలిసారిగా నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు 11వ తేదీన మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగింది. రెండవ షిఫ్టు మద్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించారు. వాస్తవానికి గత ఏడాది తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి దీనిపై చాలా చర్చ జరిగింది. వాదనలు చోటుచేసుకున్నాయి. కానీ NBEMS స్పందించలేదు.
Also read: JEE Main 2025 Results: జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు, ర్యాంకుల విడుదల, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









