నీట్ ఫలితాలు విడుదల: మాధురి రెడ్డికి 7వ ర్యాంక్

నీట్ ఫలితాలు:మాధురి రెడ్డికి 7వ ర్యాంక్

Last Updated : Jun 6, 2019, 12:18 PM IST
నీట్ ఫలితాలు విడుదల: మాధురి రెడ్డికి 7వ ర్యాంక్

హైదరాబాద్: నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో 2019–20 వైద్య విద్య సంవత్సరంలో ప్రవేశాల కోసం నీట్ పరీక్షను నిర్వహించిన ఎన్టిఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)నే ఈ ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. నీట్ ఫలితాల్లో రాజస్తాన్‌కి చెందిన నలిన్ ఖండేల్‌వాల్ 701 మార్కులతో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకోగా తెలంగాణకు చెందిన మాధురి రెడ్డి 695 మార్కులతో 7వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఏ ప్రకటించిన నీట్ ఫలితాలను సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.inలో కానీ లేదా mcc.nic.in వెబ్‌సైట్‌లో కానీ చెక్ చేసుకోవచ్చు.

మే 5న నీట్ పరీక్ష జరగ్గా ఫొని తుపాన్ కారణంగా ఒడిషాలో ఆరోజు పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఒడిషాలోని నీట్ అభ్యర్థులతోపాటు కర్ణాటకలో రైళ్లు ఆలస్యంగా నడిచిన కారణంగా సకాలంలో పరీక్షకు హాజరుకాలేక మే 5న ఆ పరీక్షను రాయలేకపోయిన అభ్యర్థులకు మే 20వ తేదీన ఎన్టిఏ మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్ ర్యాంక్ ఆధారంగానే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ చేపట్టనున్నారు.

Trending News